పైన ఫోటోలో కనిపిస్తున్న వీరిద్దరూ చిన్నప్పుడే అమ్మానాన్నలను పోగొట్టుకున్నారు. ఈ ఇద్దరు అన్న చెల్లెళ్లను దగ్గరి బంధువులు కాస్త అన్నం పెట్టి పెంచారు. అన్నమైతే పెట్టారు కానీ తల్లిదండ్రుల ప్రేమ మాత్రం పంచలేరు. అలా ఇద్దరు అన్నా చెల్లెళ్లు ఒకరికొకరు ఓదార్చుకుంటూ తోడునీడగా కలిసిమెలిసి పెరిగారు.. ఇక బంధువులకు భారంగా ఉండకూడదని భావించి అన్న ఇంటర్లో చదువు మానేసి చెల్లిని చదివిస్తూ వచ్చాడు. చెల్లి డిగ్రీ పూర్తి చేసింది.. ఓ కంపెనీలో ఉద్యోగం కూడా సాధించింది. ఇక రెండు రోజుల్లో జాయిన్ అయ్యే సమయంలో విధి వీరిని వంచించింది..
Advertisement
Also Read;పెద్ద కళ్ళతో అమాయకంగా చూస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్..!!
ఒకేసారి ఇద్దరు అన్న చెల్లెలు ప్రమాదంలో మరణించారు.. వివరాలు ఏంటో చూద్దాం.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలం ఇల్లందులో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.. చుంచుపల్లి మండలం ఎన్ కె నగర్ పంచాయతీకి చెందిన మరికంటి నీరజ్ 27, నిహారిక22, అన్నా చెల్లెలు. ఇక వీరు చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. దీంతో పెద్దనాన్న అశోక్ నాయనమ్మలు వీరిని కాస్త పెద్ద అయ్యే వరకు పెంచారు. ఇక నీరజ్ ఇంటర్లో చదువు మానేసి స్థానికంగా ఉన్న ఒక కార్ల షో రూమ్ లో పని కుదుర్చుకొని , చెల్లెలు నిహారికను డిగ్రీ వరకు చదివించాడు.
Advertisement
ఆమె కూడా పట్టుదలతో చదువుకొని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాన్ని సాధించింది. ఇక రెండు రోజుల్లో ఉద్యోగంలో చేరాలి. ఈ క్రమంలోనే అన్నా చెల్లెలు ఇద్దరు తన స్నేహితురాలు మేరీ తో కలిసి పార్టీ చేసుకోవడానికి బైక్ పై పాల్వంచ వెళ్లారు. అక్కడ డిన్నర్ చేసి రాత్రి తిరిగి వస్తున్న క్రమంలో రేగళ్ల క్రాస్ రోడ్డు వద్ద వీరి వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది. ప్రమాదంలో అన్నా చెల్లెలు ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మేరీ పరిస్థితి విషమంగా మారింది. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు ఒకేసారి మరణించడంతో వారి గ్రామంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. తల్లిదండ్రులను కోల్పోయి కష్టపడి బతికి సంతోషంగా జీవిద్దాం అనుకునే టైంలో ఇలా జరిగిందేంటి అంటూ ఆ గ్రామస్తులంతా కన్నీరు మున్నీరుగా విలపించారు.
Also Read;అల్లు ఫ్యామిలీతో గొడవలు…ఇరిటేషన్ వచ్చింది అంటూ చిరంజీవి ఓపెన్ కామెంట్స్..!