Home » పెద్ద కళ్ళతో అమాయకంగా చూస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్..!!

పెద్ద కళ్ళతో అమాయకంగా చూస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇండస్ట్రీలో ఒకప్పుడు బ్యాడ్ లక్ హీరోయిన్ గా ముద్ర వేసుకున్న ఈ అమ్మడు, ప్రస్తుతం వరుస ఆఫర్లతో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది. తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది. ప్రస్తుతం ఈమెకు సంబంధించిన చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. ఈ హీరోయిన్ ని మీరు గుర్తుపట్టారా.. పెద్ద కళ్ళతో అమాయకంగా చూస్తూ క్యూట్ గా కనిపిస్తున్న ఈ చిన్నారి ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా అదరగొడుతుంది.

Advertisement

Also read;సమంత తెల్లని దుస్తులు జపమాల ధరించడం వెనుక ఇంత కథ ఉందా..?

Advertisement

ఇంతకీ ఆమె ఎవరయ్యా అంటే పొడుగు కాళ్ల సుందరి పూజా హెగ్డే.. కర్ణాటకలో జన్మించిన ఆమె ముంబైలో పుట్టి పెరిగింది. మోడల్ గా కెరియర్ ను ప్రారంభించి, 2012లో జీవా నటించిన తమిళ చిత్రం మూగమూడి ద్వారా సినీరంగంలోకి వచ్చింది. అలాగే నాగచైతన్య సరసన ఒక లైలా కోసం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ తో ముకుంద మూవీ చేసింది.

కానీ ఈ రెండు సినిమాలు డిజాస్టర్ తెచ్చుకోవడంతో ఐరన్ లెగ్ గా ముద్ర పడింది. ఆ తర్వాత అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాధం తెలుగులో నటించి సూపర్ హిట్ కొట్టి మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. రంగస్థలంలో ప్రత్యేక సాంగులో రామ్ చరణ్ పక్కన అదరగొట్టేసింది. ఆ తర్వాత గద్దల కొండ గణేష్, మహర్షి,అలవైకుంఠపురం వంటి సినిమాల్లో నటించి డేట్స్ కూడా దొరకని హీరోయిన్ గా మారిపోయింది. అలాంటి ఈ స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

A lso read;CHIRANJEEVI : మెగాస్టార్ తన ఫోన్ లో సురేఖ, పవన్, చరణ్ పేర్లను ఏమని సేవ్ చేసుకున్నారో తెలుసా ?

Visitors Are Also Reading