Home » OTT లోకి డైరెక్ట్ గా విశ్వక్సేన్ కొత్త సినిమా… ఐదుగురు హీరోయిన్స్ తో!

OTT లోకి డైరెక్ట్ గా విశ్వక్సేన్ కొత్త సినిమా… ఐదుగురు హీరోయిన్స్ తో!

by Bunty
Ad

విశ్వక్సేన్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎదుగుతున్న హీరోలలో విశ్వక్సేన్ ముందు వరసలో ఉన్నారు. చేసిన ప్రతి సినిమా హిట్ కొడుతూ స్టార్ హీరోగా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి విశ్వక్సేన్ తాజాగా దాస్ కా దమ్కీ అనే మూవీతో త్వరలో థియేటర్లోకి వచ్చాడు.

Advertisement

ఈ సినిమా కంటే ముందు అశోకవనంలో అర్జున కళ్యాణం అనే చిత్రంతో సూపర్ హిట్ కొట్టి మంచి నటుడిగా మార్కులు కొట్టేశాడు. ఈయన సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే ట్యాగ్ తెచ్చుకున్నాడు. అలాంటి విశ్వక్సేన్ బిహేవియర్ మీద ఈ మధ్యకాలంలో అనేక వార్తలు వచ్చాయి. అయితే తాజాగా విశ్వక్సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘ ఆకాష్, మంజిమా మోహన్ ప్రధాన పాత్రలో నటించిన బూ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి రాబోతుంది.

Advertisement

తమిళ్ డైరెక్టర్ విజయ్ తెరకేక్కించిన ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల థియేటర్లలో విడుదల కాలేదు. ఇప్పుడు ఈ సినిమా నేరుగా ఓటీటిలో రిలీజ్ కాబోతుంది. ఈ హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ ని జియో సినిమా ఓటిటి ప్లాట్ ఫామ్ లో తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ నెల 27న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ జియో సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Hansika: స్టార్ హీరో డేట్ కు వస్తావా అంటూ వేధించాడు.. హన్సిక సంచలన వ్యాఖ్యలు

The Kerala Story : కేరళ స్టోరి సినిమా చూసి ప్రియుడుపై రే*కేసు పెట్టిన ప్రియురాలు

Ap : రాధ హ* కేసులో ఊహించని మలుపు.. భర్తే హ*కుడు!

Visitors Are Also Reading