Home » హృతిక్ రోష‌న్ పై నెటిజ‌న్లు గ‌రం గ‌రం.. ముందు నీ సినిమా సంగ‌తి చూస్కో..!

హృతిక్ రోష‌న్ పై నెటిజ‌న్లు గ‌రం గ‌రం.. ముందు నీ సినిమా సంగ‌తి చూస్కో..!

by Anji
Ad

బాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ గా పేరుసంపాదించుకున్న అమీర్ ఖాన్ కొత్త మూవీ లాల్ సింగ్ చ‌డ్డా వివాదం రోజుకొక కొత్త మ‌లుపు తిరుగుతోంది. ఇప్ప‌టికే ఈసినిమాను బాయ్‌కాట్ లాల్ సింగ్ చ‌డ్డా హ్యాష్ ట్యాగ్‌తో నెటిజ‌న్లు ఈ చిత్రాన్ని తీవ్రంగా వ్య‌తిరేకించ‌డంతో బాక్సాఫీస్ వ‌ద్ద ఈ సినిమా అంత‌గా ఆక‌ట్టుకోలేక‌పోయింది. తాజాగా ఈ చిత్రాన్ని ముంబ‌యిలోని మ‌ల్టిప్లెక్స్ లో చూసిన హీరో హృతిక్ రోష‌న్ ఈ సినిమా చాలా బాగుంద‌ని.. ప్ల‌స్‌లు, మైన‌స్‌ల‌ను మిన‌హాయిస్తే సినిమా చాలా బాగుంద‌ని చెప్పుకొచ్చాడు.

Advertisement

ఇక అంతేకాదు. ఒక మంచి సినిమాను మీరు మిస్ అవ్వ‌వ‌ద్దు. వెళ్లి వెంట‌నే చూడండి అంటూ ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేశాడు. దీంతో నెటిజ‌న్లు హృతిక్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అవునా..? క‌శ్మీర్ ఫైల్ మూవీ విడుద‌ల స‌మ‌యంలో ఎక్క‌డ ఉన్నావు.? క‌శ్మీర్ ఫైల్స్ మూవీ చూశావా..? నువ్వు, నీ మాజీ భార్య ద‌ర్టీ మారిట‌ల్ అఫైర్స్ గురించి మీడియాలో దుమ్మెత్తి పోస్తున్నారు. స్టాప్ దిస్ నాన్సెన్స్ ఫ‌స్ట్‌, మ‌న పిల్ల‌లు త‌ప్పుగా ప్ర‌భావిత‌మ‌వుతారు. అయితే అయితే ఈసారి నీ కొత్త సినిమా విక్ర‌మ్ వేద వంతు అయింది.

Advertisement

హృతిక్ ముందు నీ సినిమా సంగ‌తి చూసుకో.. బాయ్‌కాట్ విక్ర‌మ్ వేద , ఇప్పుడు విష‌యం నీకు అవ‌స‌ర‌మా.. అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు నెటిజ‌న్లు. సైఫ్ అలీఖాన్‌, హృతిక్ రోష‌న్ హీరోలుగా త‌మిళ చిత్రం విక్ర‌మ్ వేద హిందీలో రీమెక్ చేసిన విష‌యం తెలిసిన‌దే విక్ర‌మ్ వేద సెప్టెంబ‌ర్ 30న విడుద‌ల‌కు స‌న్నాహాలు చేస్తుంది చిత్ర యూనిట్‌. ఈ త‌రుణంలో తాజా వివాదంలో హృతిక్ ఎందుకు త‌ల‌దూర్చాడంటూ విక్ర‌మ్ వేద నిర్మాతలు సైతం అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్న‌ట్టు బాలీవుడ్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

Also Read : 

సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలోని ఈ చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇంత అందంగా ఉందా..?

మ‌హాన‌టి సినిమాలో తొలుత అనుకున్న హీరోయిన్ గురించి మీకు తెలుసా..?

Visitors Are Also Reading