Home » 25 ఏళ్ల సినీ కెరీర్ లోనే అతిపెద్ద లాస్.. దిల్ రాజు కామెంట్స్ వైరల్..!

25 ఏళ్ల సినీ కెరీర్ లోనే అతిపెద్ద లాస్.. దిల్ రాజు కామెంట్స్ వైరల్..!

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ముఖ్యంగా ఓవైపు డిస్ట్రిబ్యూషన్ కొనసాగిస్తూనే మరోవైపు సినిమాలను నిర్మిస్తుంటారు. ఈయన హిట్, ప్లాప్ లతో సబంధం లేకుడా వరుస సినిమాలను నిర్మిస్తుంటారు. స్టార్ హీరోలతో పెద్ద సినిమాలే కాదు.. ఎలాంటి స్టార్స్ లేకుండానే కొత్త దర్శకులకు సైతం ఛాన్స్ ఇస్తూ.. హిట్స్ అందుకున్నటువంటి  సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇండస్ట్రీలో ప్లాప్ లు ఎదురైనా వాటిని తట్టుకొని ఇండస్ట్రీలో నిలబడే వారిలో ముందుంటారు దిల్ రాజు. ఇటీవలే బలగం మూవీతో హిట్ అందుకున్న విషయం విధితమే. దీంతో ఆయన నిర్మాణం వహించిన శాకుంతలం మూవీపై పలు అంచనాలు పెరిగాయి. 

Also Read :  ఓటిటిలోకి వచ్చేసిన ‘రావణాసుర’… స్ట్రీమింగ్ ఎప్పుడంటే…?

Advertisement

భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బిగ్ డిజాస్టర్ అయింది. భారీ వసూళ్లు రాబడుతుందనుకున్న ఈ చిత్రం  పెట్టుబడిలో సగానికి సగం సైతం చేరుకోలేకపోయింది. శాకుంతలం ఈ చిత్రం విడుదలకు ముందు  దిల్ రాజు గొప్పగా చెప్పడంతో రిజల్ట్స్ తరువాత ఆయనపై ట్రోలింగ్స్ కూడా చేశారు. తాజాగా శాకుంతలం సినిమా  ఫలితం పై ఓపెన్ అయ్యారు దిల్ రాజు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో దిల్ రాజు మాట్లాడారు. శాకుంతలం సినిమా మిస్ ఫైర్ అయిందని.. సోమ, మంగళ వారాల్లో కలెక్షన్లు రాలేదంటే ఫిక్స్ అయిపోవాలని రియలైజేషన్ కావాలన్నారు. శాకుంతలం సినిమా తనకు పెద్ద ఝలక్ ఇచ్చిందని చెప్పారు.  25 ఏళ్ల కెరీర్ లో ఇది ఊహించని పరిణామమని పేర్కొన్నారు. 

Advertisement

Also Read :  Vyavastha Web Series Review : ఆ డైరెక్టర్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా ?

శాకుంతలం సినిమాపై ఉన్నది ఉన్నట్టు మాట్లాడారు దిల్ రాజు. గుణశేఖర్ తో కలిసి ఈ మూవీని నిర్మించారు. సమంతపై ఉన్న నమ్మకంతో వీరు పెట్టుబడి భారీగానే పెట్టారు. ఇటీవలే బలగం, దసరా సినిమాలతో హిట్స్ అందుకున్న దిల్ రాజు శాకుంతలం సినిమా మాత్రం నిరాశ పరిచిందనే చెప్పాలి. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమాలో సమంత ప్రధాన పాత్రలో నటించగా.. దేవ్ మోహన్, అల్లు అర్హ,మోహన్ బాబు, ప్రకాశ్ రాజు, మధుబాల, గౌతమి కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల మధ్య ఏప్రిల్ 14న విడుదలైన ఈ మూవీ బిగ్ డిజాస్టర్ అయింది. 

Also Read :  CITADEL REVIEW : “సిటాడెల్” వెబ్ సిరీస్ రివ్వ్యూ..అదిరిపోయే యాక్ష‌న్ తో..!

Visitors Are Also Reading