Home » ఇప్పుడేమో ఇలా..నాగ్ సార్ ముందు అలా.. ప్రశాంత్ పరువు తీసిన గౌతమ్ కృష్ణ

ఇప్పుడేమో ఇలా..నాగ్ సార్ ముందు అలా.. ప్రశాంత్ పరువు తీసిన గౌతమ్ కృష్ణ

by Anji
Ad

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. ఇక  ఈసారి కూడా ప్రేక్షకులను తనదైన స్టైల్ లో అలరిస్తోంది ఈ షో. ఇక ఇప్పటికే 6 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఈసారి ఏడోసారి అంత ఉల్టా పుల్టా అంటూ రంగంలోకి దిగారు. ప్రస్తుతం ఏడో సీజన్  కొనసాగుతోంది. దీనికి కూడా అక్కినేని  నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇక  ఈసారి 14 మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఏడో సీజన్ లోకి 20 మందికి పైగా కంటెస్టెంట్ లు ఉండవచ్చని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా 14 మందిని హౌస్ లోకి పంపించి ఆట మొదలుపెట్టారు బిగ్ బాస్.

Advertisement

ఇది ఉల్టా పుల్టా కాన్సెప్ట్ అని ముందు నుంచి చెబుతూ వస్తున్న నాగార్జున ఈ షో ప్రసారంలో ఎన్నో ఊహించని సంఘటనలు చూపిస్తున్నారు. షో మధ్యలో ఇంకొందరు కంటెస్టెంట్స్ యాడ్ అవ్వడం మనం చూస్తేనే ఉన్నాం. మరోవైపు హౌస్ లో హీట్ పెంచే గొడవలు జరుగుతున్నాయి. గత ఎపిసోడ్ లో పల్లవి ప్రశాంత్, బోలే షావలికి ఊహించని కౌంటర్ ఇచ్చాడు గౌతమ్ కృష్ణ. ప్రస్తుతం ఎనిమిదో వారం నామినేషన్స్ జరుగుతుండగా సోమవారం దసరా పండుగ రోజు రాత్రి ప్రసారమైన ఎపిసోడ్ చాలా రసవత్తరంగా సాగింది. ప్రతి కంటెస్టెంట్ తాను నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు ఫోటోలను మంటల్లో కాల్చి అందుకు తగిన సమాధానం చెప్పాలని బిగ్ బాస్ చెప్పాడు. దీంతో గౌతమ్ కృష్ణ ఎవరు ఊహించని పాయింట్స్ తీస్తూ జనాలలో హీట్ పెంచేశాడు. ఆయన చెప్పిన కొన్ని పాయింట్స్ అందరినీ ఆలోచింపజేశాయి. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను నామినేట్ చేస్తున్నప్పుడు సందీప్ మాస్టర్ విషయంలో నువ్వు మాట మార్చడం, అది అడిగిన నాగార్జున సార్ ముందు డిఫెండ్ చేసుకోలేకపోవడం నచ్చలేదు అని చెప్పాడు గౌతమ్. దీంతో పల్లవి ప్రశాంత్ బదులు ఇవ్వలేకపోవడం చూశాం.

Advertisement

ఇక ఆ తర్వాత గౌతమ్ కృష్ణ పల్లవి ప్రశాంత్ మధ్య కాసేపు వాదన జరిగింది. అయితే కూల్ గా ఉంటూనే పల్లవి ప్రశాంత్ ను తన ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశాడు గౌతం కృష్ణ. ఆ తర్వాత భోలే షావలిని నామినేట్ చేస్తూ తనదైన స్టైల్ లో రీజన్స్ చెప్పాడు. బోలే షావలిని టాస్క్ లో ఫిజికల్ గా వీక్ గా ఉన్నారని కూల్ గా చెప్పాడు గౌతమ్. కానీ బోలే మాత్రం గౌతమ్ ను వెక్కిరిస్తున్నట్లు పాటలు పాడుతూ రచ్చ చేశాడు. నువ్వు డాక్టర్ అయితే చేయి పట్టుకొని బీపీలు చూడు.. నేను వీకో కాదో చెప్పకు అని అన్నాడు. అయితే ఈ మొత్తం సీన్లో గౌతం కృష్ణ కూల్ గా ఉండడం నామినేషన్ లో ఆయన తీసిన పాయింట్స్ జనాలకు కనెక్ట్ అయ్యాయి అని చెప్పవచ్చు. 

మరిన్ని సినిమా వార్తల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం

Visitors Are Also Reading