Home » Bigg Boss Season7 :  ఊహించని మార్పులతో నాగార్జున ప్లాన్..!

Bigg Boss Season7 :  ఊహించని మార్పులతో నాగార్జున ప్లాన్..!

by Anji
Ad

బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎక్కడో హాలీవుడ్ లో ప్రారంభమైన బిగ్ బాస్ ఇప్పుడు దాదాపు అన్ని భాషల్లోకి విస్తరించింది. తెలుగులోకి కూడా వచ్చిన బిగ్ బాస్ ఇప్పటివరకు 6 సీజన్లను, ఒక ఓటీటీ సీజన్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. బిగ్ బాస్ 7 సీజ్ కి సిద్ధమవుతోంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7కి సంబంధించిన టీజర్ కూడా విడుదల అయింది.  అదేవిధంగా 7వ సీజన్ లో హౌస్ లో కనిపించే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ గాసిప్స్ కూడా వచ్చేస్తున్నాయి. అలా వచ్చే వాళ్లు దాదాపు ఖాయమే అని తెలుస్తోంది. ఈసారి వస్తున్న బిగ్ బాస్ సీజన్ 7 గతం కంటే కాస్త భిన్నంగా ఉంటుందని తెలుస్తోంది.

Advertisement

ప్రధానంగా ఓటింగ్ విషయంలో చాలా పెద్ద మార్పు చేయబోతున్నట్టు సమాచారం. గతంలో నామినేషన్స్ లో ఉన్న వారికి మద్దతుగా ఓట్లు వేయడానికి సోమవారం నుంచి శుక్రవారం వరకు సమయం ఉండేది.కానీ దానిని మూడు రోజుల వరకేపరిమితం చేశారు. వారంలో తొలి రోజులు మాత్రమే ఓట్లు వేసే అవకాశం ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా గత సీజన్ అన్నీ కూడా ఓ ప్యాట్రన్ ఫాలో అవుతూ వచ్చాయి. వారం మధ్యలో గేమ్స్, వీకెండ్స్ లో నాగార్జున హోస్టింగ్ ఆదివారం ఎలిమినేషన్స్ ఉండేవి. బిగ్ బాస్ సీజన్ 7లో మాత్రం ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో తెలియదట.

Advertisement

నాగ్ హోస్టింగ్ మధ్యలో కూడా రావచ్చని.. వీక్ మధ్యలో కూడా ఎలిమినేషన్స్ ఉంటాయని తెలుస్తుంది. దీంతో పాటు నామినేషన్స్ ప్రక్రియ గతం కంటే చాలా భిన్నంగా ప్లాన్ చేసినట్టు సమాచారం. మరో భారీ మార్పు ఏంటంటే..? బిగ్ బాస్ హౌస్ నిర్వాహణ రోజులు.. తొలి సీజన్ సమయంలో కేవలం 70 రోజులే ఉండేది. కానీ ఆ తరువాత దానిని 100 రోజులకు పెంచారు. మళ్లీ ఈసారి దానిని తగ్గిస్తున్నట్టు తెలుస్తోంది. కేవలం 10 వారాల్లోనే బిగ్ బాస్ సీజన్ 7 ను ముగించాలని నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. 10 వారాల పాటు ఎలిమినేషన్స్ జరిగిన తరువాత 70వ రోజు విన్నర్ ని ప్రకటిస్తారని సమాచారం. 

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు  : 

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లిపై ఆస్ట్రాలజర్ వేణు స్వామి ఏమన్నారో తెలుసా ? 

అన్నయ్య అని పిలిచిన వ్యక్తినే శ్రీదేవి పెళ్లి చేసుకుందా..? అతను ఎవరంటే..?

 

Visitors Are Also Reading