Home » Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ సీజన్‌ 7 ఏ రోజు ప్రారంభం అవుతోందో తెలుసా? అఫీషియల్ ప్రకటన చేసిన మేకర్స్!

Bigg Boss 7 Telugu: బిగ్‌బాస్‌ సీజన్‌ 7 ఏ రోజు ప్రారంభం అవుతోందో తెలుసా? అఫీషియల్ ప్రకటన చేసిన మేకర్స్!

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

ఎన్ని మీమ్స్ వచ్చినా, ఎంత ట్రోలింగ్ జరుగుతున్నా.. బిగ్ బాస్ సీజన్ చూసే వాళ్ళకి కొదవ లేదు. చాలా మంది బిగ్ బాస్ కు ఫ్యాన్స్ ఉన్నారు. ఈ రియాలిటీ షో ఎన్ని సీజన్స్ వచ్చినా ఆడియన్స్ లో జోష్ తగ్గదు. అయితే.. ప్రతి సారీ ఈ సీజన్ లో ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అన్న విషయం ఆసక్తికరంగా మారుతూ ఉంటుంది. తాజాగా.. బిగ్‏బాస్ సీజన్ 7 రాబోతోంది. ఎప్పటిలానే, నాగార్జున ఈ సీజన్ కు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.

big boss

Advertisement

ఈ సారి బిగ్‏బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ లిస్ట్ వచ్చేసింది. ఈ సారి బిగ్ బాస్ లో పాల్గొనబోయేది వీరే అంటూ ఓ లిస్ట్ నెట్టింట్లో తెగ హల్ చల్ చేస్తోంది. అయితే.. సీజన్ 6 లో జరిగిన తప్పులు జరగకుండా చూసుకుని డబుల్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే సిద్ధం అయినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాగా.. కంటెస్టెంట్స్ అందరు ప్రేక్షకులకు తెలిసినవారే. సోషల్ మీడియాలో ఇప్పటికే ఈ లిస్ట్ చక్కర్లు కొడుతోంది.

Advertisement

ఇది ఇలా ఉంటె ఈ షో ఎప్పుడు ప్రారంభం అవుతుందా? అని బిగ్ బాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ ఎదురు చూపులకు ఇక తెరపడనుంది. బిగ్ బాస్ ఆటను ప్రారంభించడానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. “‘ఎవరి ఊహకు అందని సీజన్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 7 సీజన్‌.. అంతా ఉల్టా పల్టా ” అంటూ ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 గురించి నాగార్జున చాలా హైప్ క్రియేట్ చేసారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ లాంచింగ్‌ గురించి అఫీషియల్ మేకర్స్ ప్రకటన విడుదల చేసారు. సెప్టెంబర్‌ 3వ తేదీన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది.

మరిన్ని..

మహేష్ బాబు కు ఉన్న ఈ ఏకైక చెడు వ్యసనం గురించి తెలుసా? స్వయంగా చెప్పిన మహేష్..!

మహేష్ బాబు హీరోగా, సౌందర్య హీరోయిన్ గా మిస్ అయినా సినిమా ఏదో తెలుసా?

Visitors Are Also Reading