Home » బిగ్ బాస్ 7 కి అంతా సిద్దం.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే..!

బిగ్ బాస్ 7 కి అంతా సిద్దం.. ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్లే..!

by Anji
Ad

సాధారణంగా బిగ్ బాస్ రియాలిటీ షోకి ఉన్నంత క్రేజ్ ఇప్పుడు దేనికి లేదనే చెప్పాలి. ఈ షోకి ప్రత్యేక క్రేజ్ ఉంది. సెలబ్రిటీల అల్లర్లు, గొడవలు, భావోద్వేగ సన్నివేశాలు ఇలా అన్ని ఎమోషన్స్ ని ఒకచోట మిక్స్ చేసి చూపిస్తూ క్రేజ్ సంపాదించుకున్న బిగ్ బాస్ షో 6 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని 7వ సీజన్ లోకి అడుగుపెడుతుంది. ఇక నిర్వాహకులు ఇప్పటికే అంతా సిద్ధం చేశారు.  గత సీజన్ ఫ్లాప్ కావడంతో ఈసీజన్ పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఇక ఈసారి ఎలాగైన సక్సెస్ సాధించాలని షో నిర్వాహకులు భావిస్తున్నారట. అందుకోసమే బిగ్ బాస్ సీజన్ 7 ప్రారంభం కాస్త ఆలస్యం అవ్వనున్నట్టు తెలుస్తోంది. 

Advertisement

చాలా పాపులర్ అయిన సెలబ్రిటీలను ఈ షో కోసం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక ఇప్పటికే వివాదస్పద వ్యక్తులను విడాకులు తీసుకొని ప్రముఖ జంటలను కొత్త జంటలను హౌస్ లోకి తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఈ లిస్ట్ లో సీరియల్ యాక్టర్స్ అమర్ దీప్, ఆయన భార్య తేజస్విని, మహేష్ బాబు, కాళిదాస్, సిద్ధార్థ్ వర్మ ఉన్నట్టు సమాచారం. మరోవైపు యాంకర్స్ రష్మి గౌతమ్, విష్ణుప్రియ, దీపికా పిల్లి ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. మంగ్లీ, హేమ చంద్ర, బుల్లెట్ బండి ఫేమ్ మోహన భోగరాజు, సాకేత్ కొమండూరి వంటి సింగర్స్ లిస్ట్ లో ఉన్నారని సమాచారం. అదేవిధంగా విడిపోయిన సింగర్ నోయల్, ఆయన మాజీ భార్య ఎస్తేర్ నొరొన్హా హౌస్ లోకి వస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సిన్హా, సీరియల్ హీరోయిన్స్ ఐశ్వర్య, శోభా శెట్టి, మిత్రా శర్మ ఉన్నట్టు తెలుస్తోంది. 

Advertisement

ఈటీవీ ప్రభాకర్, కొరియోగ్రఫర్ పండు, జబర్దస్త్ అప్పారావు, న్యూస్ రీడర్ ప్రత్యూష, డ్యాన్సర్ శ్వేత నాయుడు, ట్రాన్స్ జెండర్ తన్మయి, మోడల్ సాయి రొనాక్, కామన్ మ్యాన్ పల్లవి, ప్రశాంత్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ సీజన్ కి హోస్ట్ గా నాగార్జున బదులు రానా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత ఉందనేది తెలియదు కానీ ఈసారి హౌస్ లోకి అడుగుపెట్టే వారి జాబితా చూస్తుంటే మాత్రం షో బంపర్ హిట్ అవ్వడం గ్యారెంటీ అనిపిస్తోంది. దీనిని బట్టి చూస్తుంటే మాత్రం ఈ సారి షో మంచి రసవత్తరంగా కొనసాగనున్నట్టు కనిపిస్తోంది. ఏం జరుగుతుందనేది చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

 Kavya Kalyan Ram : ‘బలగం’ బ్యూటీ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాలు ఇవే ..!

జూబిలీ హిల్స్ రోడ్డుపైనే రామ్ గోపాల్ వర్మ భార్య పరిగెత్తించి మరీ ఎందుకు కొట్టింది ?

Visitors Are Also Reading