Home » Bigboss 6 Telugu: శ్రీహాన్ కి సిరి బ్రేకప్ చెప్పినట్టేనా.. కారణం ఏంటంటే..?

Bigboss 6 Telugu: శ్రీహాన్ కి సిరి బ్రేకప్ చెప్పినట్టేనా.. కారణం ఏంటంటే..?

by Sravanthi
Ad

బుల్లితెర రియాల్టీ షోలలో బిగ్ బాస్ ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో మనందరికీ తెలుసు.. ఇప్పటికే విజయవంతంగా 5 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ ఆరో సీజన్ కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఈ సీజన్ కూడా ఇంకో రెండు వారాల్లో కంప్లీట్ అవ్వబోతోంది.. ఈ తరుణంలో బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరు అనేది చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న.. 21 మంది కంటెస్టెంట్లుగా వచ్చిన ఈ సీజన్లో వారం వారం ఉహించని ఎలిమినేషన్స్ జరిగి ఇప్పటికే చాలామంది బయటకు వెళ్లిపోయారు. ఈ తరుణంలో మిగతా కంటెస్టెంట్లలో విన్నర్ ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది..

Advertisement

also read;భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ అయ్యిన 5 సినిమాలు ఇవే….!

కట్ చేస్తే.. సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అయిన శ్రీహన్ ఈసారి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చారు.. ఇప్పటికే ఆయన తన పర్ఫామెన్స్ తో బిగ్ బాస్ హౌస్ లో టాప్ ఫైవ్ లో ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఆయన లవర్ సిరి అని చెప్పవచ్చు.. ఆమె బయట నుంచి శ్రీహాన్ కు చాలా సపోర్ట్ చేస్తుంది.. అయితే ఈ తరుణంలోనే శ్రీహాన్ కు సిరి బ్రేకప్ చెప్పినట్లు తాజాగా కొన్ని వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.. మాజీ బిగ్ బాస్ బ్యూటీ అరియానా గ్లోరీ ఇంటర్వ్యూ కు సిరి గెస్ట్ గా వచ్చింది.. ఈ సందర్భంగా అరియానా సిరికి ఒక యూట్యూబ్ ఛానల్ థంబ్ నేయిల్ చూపించి శ్రీహాన్ కు మీకు పెళ్లి ఎప్పుడు జరిగింది అని ప్రశ్నించింది.

Advertisement

దీంతో సిరి వచ్చే సంవత్సరంలో పెళ్లి కచ్చితంగా జరుగుతుంది అని సమాధానం ఇచ్చింది. మరో యూట్యూబ్ ఛానల్ థంబ్ నెయిల్ చూపించి పెళ్లి కాకుండానే తల్లివి అయ్యావు కదా అని అడిగింది. దీంతో సిరి తన కడుపు వైపు చూసుకొని అలాంటిదేమీ లేదంటూ చెప్పుకొచ్చింది. మరో యూట్యూబ్ ఛానల్ వారు పెట్టిన థంబ్ నెయిల్ చూపించి సిరి జ్ఞాపకాలు లైఫ్ లోంచి తీసేసుకున్న శ్రీహాన్ ఇది నిజమేనా అంటూ ప్రశ్నించింది.. దీంతో సిరి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ అలాంటిది ఏమీ లేదు మా మధ్య ఎన్నో గొడవలు జరుగుతాయి.కానీ మళ్ళీ సర్దుకుపోతామంటూ చెప్పుకొచ్చింది.. ఈ విధంగా ఈమె చెప్పే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తిగా సిరి శ్రీహాన్ గురించి ఏం చెప్పింది అనేది కావాలంటే పూర్తి ఎపిసోడ్ చూడాల్సిందే.

also read;తమ్ముడు మూవీలో లవ్లీ గా చేసిన హీరోయిన్.. మరీ ఇలా తయారైందేంటి..?

Visitors Are Also Reading