Home » రవితేజ సినిమాకు భారీ ఆఫర్.. ఎన్ని కోట్లంటే..?

రవితేజ సినిమాకు భారీ ఆఫర్.. ఎన్ని కోట్లంటే..?

by Azhar

గత ఏడాది క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న మాస్ మహారాజ రవితేజ అప్పుడే వరుస సినిమాలను అనౌన్స్ చేసాడు. ఇక అందులో ఒక్కటైనా ఖిలాడీ అనే సినిమా ఈ ఏడాది ప్రారంభంలో విడుదలహల అయ్యింది. అయితే రవితేజ కెరియర్ లో భారీ బడ్జెట్ సినిమా వచ్చిన ఖిలాడీ జనాలను అంతగా మెప్పించలేదు. అయిన కూడా దానిని అంతగా పట్టించుకోని.. రవితేజ తన సినిమా షూటింగ్స్ పైనే దృష్టి పెట్టాడు. అయితే ఈరోజు మాస్ మహారాజ రవితేజ నటించిన రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమా జనల ముందుకు వచ్చింది. ఇందులో రవితేజకు జంటగా.. మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ నటించింది.

అయితే శరత్ మండవ దర్శకత్వం వహించిన ఈ రామారావు ఆన్ డ్యూటీ నేడు విడుదల తర్వాత మొదటి రోజే అభిమానుల నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ఈ సినిమాను కొందరు బాగుంది అంటే.. మరికొందరు బాగాలేదు అనే కామెంట్స్ చేస్తున్నారు. అందువల్ల ఈ సినిమా హిట్టా ఫట్టా అనేది తెలియడం లేదు. ఇలాంటి క్రమంలోనే ఈ సినిమా ఓ భారీ అఫ్ఫార్ అనేది వచ్చింది. అయితే కరోనా సమయంనుండి మన దగ్గర ఓటీటీ సంస్థలు అనేవి జోరు చూపిస్తున్న విషయం తెలిసిందే. అప్పుడు థియేటర్లు లేక.. చాలా సినిమాలు నేరుగా ఓటీటీలోకి రాగ.. ఇప్పుడు ఆ సంసథలు సినిమాలకు భారీ ఆఫర్స్ అనేవి ఇచ్చి.. అట్రాక్ట్ చేస్తున్నాయి.

అందువల్ల సినిమా థియేటర్లోకి వచ్చిన కొన్ని రోజులోనే ఓటీటీ లోకి వస్తుంది. ఇక ఇదే ఫీలింగ్ తో చాలా మంది థియేటర్లకు వెళ్లడం కూడా ఆపేసారు. ఇక ఇప్పుడు అదే తరహాలో ఇప్పుడు రామారావు ఆన్ డ్యూటీ సినిమా కూడా ప్రముఖ సోని లీవ్ అనే ఓటీటీ సంస్థ నుండి భారీ ఆఫర్ వచ్చింది. సినిమాను తొందరగా విడుదల చేస్తే.. ఏకంగా 12 కోట్లు ఇస్తాం అని చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఇలా మిశ్రమ స్పందన అనేది వచ్చిన నేపథ్యంలో ఇంత మంచి ఆఫర్ ను వదులుకోవాలా.. వద్ద అని సినిమా నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

సంజూ వచ్చేసాడు… ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..!

ఇక ఏడాదికి రెండు ఐపీఎల్స్.. ఎలా అంటే..?

Visitors Are Also Reading