Home » ఇక ఏడాదికి రెండు ఐపీఎల్స్.. ఎలా అంటే..?

ఇక ఏడాదికి రెండు ఐపీఎల్స్.. ఎలా అంటే..?

by Azhar

ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఐసీసీ నిర్వహించే ప్రపంచ కప్స్ కంటే ఎక్కువ క్రేజ్ అనేది మన బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్ కు ఉంటుంది. 2008 లో ప్రారంభమైన ఈ ఐపీఎల్ అనేది ప్రతి ఏటా తన క్రేజ్ ను పెంచుకుంటూనే పోతుంది. అందువల్లే ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లోకి రెండు కోట జట్లను తీసుకువచ్చింది బీసీసీఐ. అలాగే ఈ ఐపీఎల్ తర్వాత వచ్చే 5 ఏళ్ళ ఐపీఎల్ సీజన్ల యొక్క మీడియా రైట్స్ అనేవి అమ్మడంతో.. 48 వేల కోట్ల కంటే ఎక్కువ డబ్బును సంపాదించింది. అందువల్ల ప్రపంచంలోనే రెండవ అతయంత ఖరీదైనా క్రీడా లీగ్ గా అవతరించింది.

అయితే మన ఐపీఎల్ కు వచ్చిన క్రేజ్ దృష్ట్యా దీనిని ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలి అనే విధాన అనేది మొదలయ్యింది. భారత మాజీ హెడ్ కోచ్ ప్రస్తుత కామెంటేటర్ రవిశాస్త్రి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేసాడు. అలాగే ఆ ఐపీఎల్ అనేది ఎలా జరుగుతుంది అనే విషయాన్ని కూడా వెల్లడించాడు. తాజాగా రవిశాస్త్రి మాట్లాడుతూ… ఇప్పుడు ఐపీఎల్ క్రేజ్ అనేది విపరీతంగా ఉంది. అందువల్ల ముందు ముందు ఈ ఐపీఎల్ అనేది ఏడాదికి రెండుసార్లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు అనేవి తగ్గిస్తే ఇలా సాధ్యం అవుతుంది.

ఇక రెండు ఐపీఎల్స్ అనేవి జరిగితే.. అందులో ఒక్కటి మామూలుగానే వేలంలో ఎప్పటి మాదిరి జరుగుతుంది. ఇక రెండో ఐపీఎల్ అనేది ఏడాది చివర్లో జరుగుతుంది. కానీ ఇందులో అన్ని మ్యాచ్ లు అనేవి ఉండవు. ఇది ఒక్క మినీ ఐపీఎల్ మాదిరి.. నాకౌట్ పద్దతిలో జరుగుతుంది. అంటే జట్టు ఓడితే ఇంటికే. ఇక ప్రస్తుతం 10 జట్ల తో ఉన్న ఐపీఎల్ అనేది మరో రెండు జట్లను పెంచుకే అవకాశం ఉంది. ఎందుకంటే.. ఇప్పుడు ఈ ఐపీఎల్ కు అంత డిమాండ్ అనేది ఉంది. ఇలా జరిగితే క్రికెట్ కూడా చాలా అభివృద్ధి అనేది చెందుతుంది అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

సంజూ వచ్చేసాడు… ఫ్యాన్స్ ఫుల్ ఖుషి..!

భారత భవిష్యత్ కెప్టెన్లు వారే…!

Visitors Are Also Reading