Home » మంచు కుటుంబంలో కొత్త కోడలు హవా… అందరిని తొక్కేస్తోందా?

మంచు కుటుంబంలో కొత్త కోడలు హవా… అందరిని తొక్కేస్తోందా?

by Bunty
Ad

మోహన్ బాబు తనయుడు మంచు మనోజ్ రీసెంట్ గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. మార్చి 3న మనోజ్ తన ప్రియురాలు మౌనిక రెడ్డిని వివాహం చేసుకున్నాడు. బంధుమిత్రుడు మరియు రాజకీయ సినీ ప్రముఖులు వీరి వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే వీరిద్దరికీ ఇది రెండో వివాహం అన్న సంగతి చాలామందికి తెలియదు. 2019 సంవత్సరంలో తన మొదటి భార్య ప్రణతి రెడ్డితో విడాకులు తీసుకున్న మనోజ్ ఆ తర్వాత భూమా మౌనిక రెడ్డితో ప్రేమాయణం నడిపి గత కొంతకాలంగా వీరిద్దరూ డేటింగ్ లో ఉండడం సోషల్ మీడియాలో తరచూ వార్తలు వచ్చాయి.

READ ALSO : పెళ్లికి ముందే నిహారికకు లవ్ ఎఫైర్లు ఉన్నాయా…?

Advertisement

 

ఇక తాజాగా మనోజ్, మౌనిక పెళ్లి జరిగింది. ఇదంతా పక్కకు పెడితే మంచు మోహన్ బాబు మార్చి 19న 71వ ఏట అడుగు పెట్టారు. విలన్ గా ప్రస్థానం మొదలు పెట్టిన మోహన్ బాబు స్టార్ హీరో స్థాయికి ఎదిగారు. సుదీర్ఘ సినిమా ప్రస్థానంలో క్యారెక్టర్ కామెడీ రోల్స్ సైతం చేశారు. 500 కు పైగా చిత్రాల్లో నటించారు. నిర్మాతగా పదుల సంఖ్యలో చిత్రాలు నిర్మించి కళామతల్లికి సేవ చేశారు. ఇక మోహన్ బాబు పుట్టినరోజు వేడుకల్లో కొత్త కోడలు మౌనిక రెడ్డి అన్ని తానే వ్యవహరించినట్టుగా తెలుస్తోంది.

Advertisement

READ ALSO : విరాట్ కోహ్లీ బయోపిక్ లో రామ్ చరణ్!

Mohan Babu: మోహ‌న్ బాబు బ‌ర్త్ డే వేడుక‌ల్లో కొత్త కోడ‌లు తెగ హంగామా చేసేసిందిగా..!

మామయ్య మోహన్ బాబు బర్త్డే ఈవెంట్లో ఆమె పాల్గొన్న ఫోటోలు బయటకు వచ్చాయి. కుటుంబ సభ్యులు అందరూ గుడికి వెళ్లారు. ప్రత్యేక పూజలు చేశారు. మోహన్ బాబుతో పాటు భార్యనిర్మల దేవి, కూతురు లక్ష్మీ మంచు, మనవరాలు, కొడుకు మనోజ్, కోడలు మౌనిక ఉన్నారు. అయితే మంచు విష్ణు మిస్. మోహన్ బాబు బర్త్డే సెలబ్రేషన్స్ ఫోటోలు మంచు లక్ష్మి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అయితే మౌనిక రెడ్డి మంచు కుటుంబంతో బాగా కలిసిపోయేసరికి ఆమె డామినేషన్ ఎక్కువైందని అంటున్నారు.

READ ALSO : భర్తతో గొడవలు… నిహారిక కోసం రంగంలోకి దిగిన చిరంజీవి?

Visitors Are Also Reading