Home » సర్కారువారిపాట లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్…ఎక్కడంటే…?

సర్కారువారిపాట లో పవన్ కళ్యాణ్ రిఫరెన్స్…ఎక్కడంటే…?

by AJAY
Ad

టాలీవుడ్ లో టాప్ హీరోలు ఎవరని అడిగితే టక్కున గుర్తుకు వచ్చే పేర్లు పవన్ కళ్యాణ్ మహేష్ బాబు. వీరిద్దరికీ ఇండస్ట్రీలో విపరీతమైన క్రేజ్ ఉంది. అంతేకాకుండా టాలీవుడ్ లో ఎక్కువ మంది అభిమానులు ఉన్నది కూడా ఈ ఇద్దరు హీరోలకే…. అటు మహేష్ బాబు సినిమా వచ్చినా ఇటు పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినా థియేటర్లు హౌస్ ఫుల్ అయిపోతాయి. టికెట్ల కోసం ప్రేక్షకులు క్యూ కడతారు.

Advertisement

ట్విట్టర్ లో రెండు మూడు రోజులపాటు వీళ్ళ సినిమాలే ట్రెండింగ్ లో ఉంటాయి. అంతేకాకుండా సినిమాలు ఎలా ఉన్నా ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం భారీగా వస్తాయి. ఇక ఇద్దరు హీరోల అభిమానుల మధ్య వార్ కూడా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని వాధించుకుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు హీరోల కొంతమంది అభిమానులు ఒకరి ఫై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఉంటారు.

 

bheemla nayak adavi thalli song

Advertisement

కానీ పవన్, మహేష్ ఒకరినొకరు చాలా గౌరవించుకుంటారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన జల్సా సినిమాకు మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇచ్చారు. ఇక తాజాగా మహేష్ బాబు సినిమా సర్కారు వారి పాట విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమా పాటను సుబ్బరాజు రింగ్ టోన్ గా పెట్టుకున్నట్టు ఓ సీన్ లో కనిపిస్తుంది.

సుబ్బరాజు కు ఫోన్ వచ్చినప్పుడు “లా లా భీమ్లా” అనే పాట రింగ్ టోన్ గా వినిపిస్తుంది. దాంతో థియేటర్ లో ఉన్న మెగా అభిమానులు కేకలు పెడుతున్నారు. మహేష్ బాబు సినిమాలో పవన్ రిఫరెన్స్ ఉండటం తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కుషీ అవుతున్నారు. దానికి సంబందించిన మీమ్స్ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అయితే ఈ సీన్ తో అయినా గొడవలు పెట్టుకునే ఫ్యాన్స్ కలిసిపోవాలి అని నెటిజన్లు కోరుకుంటున్నారు.

Also read :

పెళ్లి చేసుకోకుండానే పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చిన సెల‌బ్రెటీలు వీళ్లే..!

సర్కారు వారి పాటకు నెగిటివ్ రివ్యూలు రావడానికి 5 కారణాలు ఇవేనా…?

Visitors Are Also Reading