Home » సర్కారు వారి పాటకు నెగిటివ్ రివ్యూలు రావడానికి 5 కారణాలు ఇవేనా…?

సర్కారు వారి పాటకు నెగిటివ్ రివ్యూలు రావడానికి 5 కారణాలు ఇవేనా…?

by AJAY
Ad

సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు హీరోగా న‌టించిన స‌ర్కారువారిపాట సినిమా ఎన్నో అంచ‌నాల మ‌ధ్య నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకు ప‌ర‌శురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా సినిమాలో హీరోయిన్ గా కీర్తిసురేష్ న‌టించింది. ఇక ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అంతే కాకుండా కొన్ని కార‌ణాల వ‌ల్ల ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వ‌స్తోంది. ఆ కార‌ణాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

Advertisement

1) గ‌తంలో మ‌హేశ్ బాబు హీరోగా వ‌చ్చిన శ్రీమంతుడు, భ‌ర‌త్ అను నేను, మ‌హ‌ర్షి సినిమాల్లో స‌మ‌స్య‌ల‌ను మాయం చేయ‌డానికి హీరో రంగంలోకి దిగుతాడు. అయితే ఈ సినిమా కూడా అదే కాన్సెప్ట్ తో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా రావ‌డంతో కొత్తద‌నం ఏమీ లేదంటూ కొంతమంది ప్రేక్ష‌కులు చెబుతున్నారు.

2) సినిమాకు ఎడిటింగ్ మైన‌స్ అయ్యింద‌ని ప్రేక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇంట‌ర్వెల్ సీన్ కూడా చెప్పుకునే విధంగా లేద‌ని టాక్.

Advertisement


3) ద‌ర్శ‌కుడు మంచి సోష‌ల్ మెసేజ్ కాన్సెప్ట్ తో వ‌చ్చిన‌ప్ప‌టికీ దానిని ప్రెజెంట్ చేయ‌డంలో ఫెయిల్ అయ్యాడ‌ని ప్రేక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.


4) క‌థ‌లో ద‌ర్శ‌కుడు చాలా లాజిక్స్ మిస్ అయ్యాడ‌ని ప్రేక్షకులు అభిప్రాయ‌ప‌డ‌తున్నారు. చిన్న చిన్న లాజిక్ ల‌ను సైతం మిస్ అవ్వ‌డంతో పాటూ క‌థ బ‌లంగా లేద‌ని చెబుతున్నారు.

5) సెకండ్ హాఫ్ సాగ‌దీత‌గా ఉంద‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. త‌మ‌న్ బీజీఎం కూడా నిరాశ‌ప‌రిచింద‌ని అభిప్రాయప‌డుతున్నారు.

ALSO READ :

ఆ సినిమా కోసం బాల‌కృష్ణ‌కు 3 కండీష‌న్స్ పెట్టిన NTR !

సమంత పర్సనల్ లైఫ్ పై లేడీ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు…!

Visitors Are Also Reading