Home » ట్రెండ్ సెట్టర్ గా భట్టి పాదయాత్ర..కర్ణాటక సీఎం ఆసక్తి.. డీకే శివకుమార్ ఆరా..!

ట్రెండ్ సెట్టర్ గా భట్టి పాదయాత్ర..కర్ణాటక సీఎం ఆసక్తి.. డీకే శివకుమార్ ఆరా..!

by Anji
Ad

తెలంగాణ కాంగ్రెస్ లో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్ర ట్రెండ్ సెట్ చేస్తోంది. తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకురావటం..రాహుల్ ను ప్రధానిని చేయడమే లక్ష్యంగా భట్టి పాదయాత్ర కొనసాగుతోంది. భట్టి యాత్ర తో తెలంగాణ కేడర్ లో జోష్ పెరిగింది. ఇవే నివేదికలతో కాంగ్రెస్ నాయకత్వం భట్టి చొరవను ప్రశంసించింది. కర్ణాటక సీఎం సిద్ద రామయ్య తెలంగాణలో భట్టి యాత్ర పైన ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను ఆరా తీసారు. భట్టి పాదయాత్రకు వస్తున్న అనూహ్య స్పందనతో కాంగ్రెస్ నాయకత్వం ప్రశంసిస్తోంది. రాహుల్ ను ప్రధానిగా చేయటం ఈ సారి దక్షిణాది రాష్ట్రాలు కీలక భూమిక పోషించనున్నాయి. అందునా తెలంగాణ ప్రధాన భూమిక పోషించనుంది. ఆ దిశగా భట్టి తన పాదయాత్రలో వేస్తున్న అడుగులు సత్ఫలితాలిస్తున్నాయి.

Advertisement

 

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ ఉంది. పదేళ్ల గులాబీ పార్టీ పాలన పైన విసుగెత్తిపోయారు. ప్రతిపక్షాలను అణిచివేయాలనే కుట్రలు కొనసాగుతున్నాయి. కేంద్ర…రాష్ట్రంలో ప్రజా సమస్యలు లేవనెత్తకుండా అక్కడ బీజేపీ..ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ సమయంలో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరరకు జోడో యాత్ర నిర్వహించారు. రాహుల్ స్పూర్తి తో తెలంగాణలో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ప్రారంభించారు. మార్చి 16న ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో ప్రారంభమైన భట్టి యాత్ర నిరాటంకంగా కొనసాగుతోంది. అనారోగ్య సమస్యలు వచ్చినా..యాత్ర కొనసాగింపులో వెనుకడుగు వేయలేదు. పార్టీ ప్రముఖులు..సీనియర్లు..కేడర్ భట్టి యాత్రకు అండగా నిలిచింది.

భట్టి పాదయాత్ర ప్రణాళికా బద్దంగా కొనసాగిస్తున్నారు. తన పాదయాత్ర ద్వారా అన్ని వర్గాల ప్రజల మధ్యకు వెళ్లారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. బాధితులకు ఓదార్పు ఇచ్చారు. ఇబ్బందుల్లో ఉన్న వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. పేదలకు మంచి జరగాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని వివరిస్తున్నారు. కేంద్రంలో ప్రధానిగా రాహుల్.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జరిగే మంచిని ప్రజల మధ్య విశ్లేషించారు. భట్టికి అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ కనిపించింది. ప్రజల నుంచి వస్తున్న స్పందన పార్టీ అధినాయకత్వం వరకు వెళ్లింది. తెలంగాణలో పార్టీ కోసం భట్టి చేస్తున్న పాదయాత్ర పైన స్వయంగా రాహుల్ గాంధీ తెలంగాణ పార్టీ ఇంఛార్జ్ థాక్రే నుంచి ఆరా తీసారు. భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర కొన‌సాగిన నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం కావ‌డంతో పాటు.. కేడ‌ర్ లో స‌రికొత్త జోష్ నెల‌కొందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement

ఇదే సమయంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తెలంగాణలో భట్టి పాదయాత్రకు వస్తున్న ఆదరణ పైన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ను వివరాలు కోరారు. సిద్దరామయ్య ఆదేశాలతో డీకే తెలంగాణలో భట్టి పాదయాత్ర గురించి ఆరా తీసారు. పాదయాత్రలో భాగంగా గిరిజ‌నులు, ఆదివాసీలు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, మైనారీటీలు, అట్ట‌డుగు వ‌ర్గాలు, అణ‌గారిన ప్ర‌జ‌లతో భట్టి మమేకమవుతున్న తీరు.. వస్తున్న స్పందన బాగుందని సర్వే సంస్థలు డీకేకు..పార్టీ అధినాయకత్వానికి నివేదికలు ఇచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పాద‌యాత్ర‌లో 500 వందలకు పైగా గ్రామాలు.. తండాలు, ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాలు కవర్ అయ్యాయి.వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీని గెలుపుతీరాలకు చేర్చటం లక్ష్యంగా ఈ పాద‌యాత్ర ముందుకు కొనసాగుతోందని డీకే సేకరించిన సమాచారంలో వెల్లడైనట్లు తెలుస్తోంది.

ఈ సారి అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ కేడర్ కు ఈ యాత్ర మరింత విశ్వాసం నింపుతోందని గుర్తించారు. కర్ణాటక తరువాత ఇప్పుడు దక్షిణాదిలో కాంగ్రెస్ కు తెలంగాణ కీలకంగా మారుతోంది. 2024లో రాహుల్ ని ప్రధాని చేయడంలో దక్షిణాది రాష్ట్రాలుకిలకంగా మారుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం..2024లో రాహుల్ ప్రధాని కావటం తన లక్ష్యమని భట్టి స్పష్టం చేస్తున్నారు. పార్టీ భవిష్యత్ కోసం భట్టి చేపట్టిన పాదయాత్ర ఈనెల 25 నాటికి 101 రోజులు పాదయాత్ర పూర్తి అవుతుంది. పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఇప్పుడు భట్టి పాదయాత్ర కాంగ్రెస్ నేతలను ఆకర్షిస్తోంది.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ప్రభాస్ పెద్దమ్మ రాజకీయాలకు ఎంట్రీ ఇవ్వనుందా.. ఆ పార్టీ నుంచేనా ?

 పవన్ కళ్యాణ్ వైఫ్ అన్నా లెజినోవా కి ఆ హీరో అంటే ఇష్టమా? ఇంతకీ ఎవరంటే?

Visitors Are Also Reading