Home » ప్రభాస్ పెద్దమ్మ రాజకీయాలకు ఎంట్రీ ఇవ్వనుందా.. ఆ పార్టీ నుంచేనా ?

ప్రభాస్ పెద్దమ్మ రాజకీయాలకు ఎంట్రీ ఇవ్వనుందా.. ఆ పార్టీ నుంచేనా ?

by Anji
Ad

సాధారణంగా సినీ పరిశ్రమకు, రాజకీయానికి అవినాభావ సంబంధం ఉంటుంది. అందుకు ఉదాహరణగా సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, రోజా వంటి వారు.. కేవలం వీరు మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు చాలా మంది రాజకీయాల్లో కొనసాగుతున్నారు. రాజకీయాల్లోకి రావాలని చూస్తున్న వారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. 

Advertisement

అంతకు ముందు రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి తెలుసుకోవాలి. ఆయన తనదైన నటనతో టాలీవుడ్ ఇండస్ట్రీలో రెబల్ స్టార్ గా ఎదిగారు. ఇండస్ట్రీలో కొనసాగుతూనే రాజకీయాల్లో కూడా రాణించారు. గతంలో ఎంపీగా కూడా పోటీ చేసి గెలుపొందారు కృష్ణంరాజు. కొంతకాలం కిందట కృష్ణంరాజు మరణించిన విషయం తెలిసిందే. కృష్ణంరాజు భార్య శ్యామల దేవి రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ తరుపు నుంచి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లాలోని నర్సాపురం  పార్లమెంట్ స్థానం నుంచి వచ్చే ఎన్నికల్లో ఆమె వైసీపీ తరపున బరిలో దిగనున్నట్టు సమాచారం. ప్రస్తుతం నర్సాపురం ఎంపీగా రఘురామ కృష్ణంరాజు ఎంపీగా కొనసాగుతున్నారు. పార్టీతో వచ్చిన అంతర్గత విబేధాల కారణంగా ఆయన చాలా కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.

Advertisement

వైసీపీ రెబల్ ఎంపీగా పేరు తెచ్చుకున్నారు రఘురామ. ఈయనకు ధీటుగా నర్సాపురం లోక్ సభ స్థానంలో కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తున్న తరుణంలోనే అధికార పార్టీకి ఆ ప్రయత్నాలు ఫలించినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పలువురు నేతలు శ్యామలదేవిని సంప్రదించారట. అందుకు ఆమె కాస్త సమయం కావాలని ఆలోచించుకొని చెబుతానని పేర్కొనడం గమనార్హం. ఈ వార్తలపై మాత్రం ప్రభాస్ పెద్దమ్మ శ్యామల దేవి నుంచి కానీ.. వైసీపీ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గంలో క్షత్రియులది బలమైన ఓటు బ్యాంకు ఉండటంతో రఘురామ కూడా అదే సామాజిక వర్గానికి చెందిన వాడు కావడంతో అక్కడ కొత్త వివాదం నెలకొంది. నర్సాపురం నియోజకవర్గం నుంచి శ్యామల దేవి పోటీ చేస్తుందా లేదా అని మరికొద్ది రోజుల్లో తేలనుంది. ఏది ఏమైనప్పటికీ ప్రభాస్ కుటుంబం మరోసారి రాజకీయాల్లోకి వస్తుందనే వార్తలపై అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

తమిళ స్టార్ హీరోలకు షాక్.. రెడ్ కార్డు ఇచ్చేందుకు నిర్మాతల మండలి సిద్ధం..!

 చాలా మందికి లైఫ్ ఇచ్చిన రాకేష్ మాస్టర్.. అనాథ ఆశ్రమంలో చేరడానికి కారణం ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading