పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి గాయాలయ్యాయి. నుదుటిపై గాయంతో రక్తం కారుతున్న ఫోటోలను తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారిక వెబ్ సైట్ లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఆమెను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే దీదీకి గాయం ఎలా అయ్యిందనే వివరాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు. ‘‘ మన పార్టీ ఛైర్ పర్సన్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. త్వరగా కోలుకోవాలని అందరూ ప్రార్థించండి‘‘ అంటూ ట్వీట్ చేశారు.
Advertisement
Advertisement
మమత బెనర్జీకి గాయం అయినట్లు తెలియడంతో పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మమతా బెనర్జీ గురువారం ఇంట్లోనే గాయపడినట్లు తెలుస్తోంది. కాలు జారిపడటంతో నుదిటికి గాయం అయినట్లుగా సమాచారం. దీంతో ఆమె గాయపడిన వెంటనే కోల్ కతాలోని SSKM హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుందన్నారు. అయితే హెల్త్ బులిటెన్ మరికాసేపట్లో విడుదల చేసే ఛాన్స్ ఉంది.
Also Read : మహేష్ బాబు, రాజమౌళి సినిమా క్రేజీ అప్డేట్.. రాజమౌళి ప్రెస్ మీట్ ఎప్పుడంటే..?