Home » మహేష్ బాబు, రాజమౌళి సినిమా క్రేజీ అప్డేట్.. రాజమౌళి ప్రెస్ మీట్ ఎప్పుడంటే..?

మహేష్ బాబు, రాజమౌళి సినిమా క్రేజీ అప్డేట్.. రాజమౌళి ప్రెస్ మీట్ ఎప్పుడంటే..?

by Anji
Ad

గుంటూరు కారం సినిమా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకున్నా.. సూపర్ స్టార్ అభిమానులకు అది అంతగా కిక్ ఇవ్వలేదు. త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. దాంతో మహేష్ బాబు నెక్ట్స్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్న రాజమౌళి.. ఇప్పుడు మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే మహేష్ సినిమాలో హీరోయిన్ గా ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లెన్ నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే ఈ అమ్మడికి స్క్రీన్ టెస్ట్ కూడా జరిగిందని తెలుస్తోంది. అంతే కాదు మహేష్ బాబు రాజమౌళి సినిమాలో మరో హీరో కూడా ఉంటారని తెలుస్తుంది.

Advertisement

 

మహేష్ బాబు రాజమౌళి సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఉంటారని తెలుస్తోంది. కీలకపాత్రలో నాగార్జున కనిపిస్తారని అంటున్నారు.  ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమానుంచి ఓ క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దర్శకుడు రాజమౌళి త్వరలోనే ఓ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. ఏప్రిల్ 9న రాజమౌళి ఓ భారీ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తోంది. ఈ ప్రెస్ మీట్ లో సినిమాలో నటించే వారిని పరిచయం చేయనున్నారని అంటున్నారు. అలాగే రెగ్యులర్ షూటింగ్ గురించి కూడా అప్డేట్ ఇవ్వనున్నారని అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

Also Read :  మంచు మనోజ్ భార్య శ్రీమంతం.. మంచు ఫ్యామిలీ లేకుండానే..?

Visitors Are Also Reading