Home » టీ చేసేటప్పుడు ఈ నాలుగు విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి.. టేస్ట్ మామూలుగా ఉండదు…!

టీ చేసేటప్పుడు ఈ నాలుగు విషయాలను తప్పకుండా గుర్తుంచుకోండి.. టేస్ట్ మామూలుగా ఉండదు…!

by Anji
Ad

సాధారణంగా ఉదయం నిద్ర లేచిన వెంటనే టీ తాగనిది కొంత మంది ఏపనిని ప్రారంభించరు. అయితే ఆ టీకి  ప్రతిసారి ఒకే రుచి రావాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి.  టీ అనేది చైనాలో పుట్టిందని కొందరు అంటే.. భారత్ లో పుట్టిందని మరికొందరూ అంటుంటారు. కానీ వాస్తవానికి ఎక్కడ పుట్టిందో తెలియదు. కానీ ప్రస్తుతం మన దేశంలో మాత్రం చాలామంది టీ తాగకుండా ఏ పని మొదలుపెట్టారు.  టీ తాగిఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటారు. ప్రతిరోజు నీళ్ల తర్వాత ఎక్కువగా తాగేది టీ నే అలాంటి టీ ఎప్పుడు పెట్టిన ఒకే రుచి రావాలి అంటే ఈ విధంగా ప్రయత్నించండి. 

Advertisement

ముఖ్యంగా  మసాలా టీ అయితే.. దాల్చిన చెక్క, అల్లం, లవంగాలు, మిరియాలు కలిపిన సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. మనం ఎప్పుడు చాయ్ పెట్టిన ఒకే రుచి రావాలి కదా.. మరి టెస్ట్ ఎలా వస్తుందో చూద్దాం..మసాలా టీ తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి పెట్టుకోండి. అందులో మీరు ఎంతమందికి టీ తాగాలనుకుంటున్నారో దాన్ని బట్టి వాటర్ వేసుకోండి. ఇక్కడ అయితే మీకు కరెక్ట్ గా చెప్పడం కోసం ఒక రెండు గ్లాసుల వాటర్ వేసుకోండి.. రెండు గ్లాసులు వాటర్ కి రెండు స్పూన్ల టీ పొడి వేసుకోండి. మీరు ఏ బ్రాండ్ టీ పొడి అయిన సరే రెండు గ్లాసుల వాటర్ కి రెండు స్పూన్ల టీ పొడి వేసుకోండి.

Advertisement

రెండు స్పూన్ల వరకు పంచదార వేయండి. ఒకవేళ స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే తగినంతగా వేసుకోండి. ఇప్పుడు ఇందులో రెండు యాలకులను కొంచెం దంచి పక్కన ఉంచండి. ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఇందులో రెండు లవంగాలను వేయండి. ఇప్పుడు ఈ వాటర్ ని బాగా మరిగించాలి. వాటర్ కలర్ చేంజ్ అయ్యే వరకు మరిగించాలి. ఇప్పుడు మనం పాలు పోసి బాగా ఉడికించాలి. ఇక్కడ మనం రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాం కాబట్టి రెండు గ్లాసులు పాలు వేసుకోండి. అయితే పాలు కూడా ఫ్రిడ్జ్ లోంచి తీసిన వెంటనే టీ లో కలపకూడదు.

ఎందుకంటే ఈ టీ డికాషన్ బాగా వేడిగా ఉంటుంది.  పాలు వేసినప్పుడు పాలు ముందుగా మీరు ఫ్రిడ్జ్ లోంచి బయట పెట్టుకొని రూమ్ టెంపరేచర్లో కనీసం అరగంట సేపు అయినా ఉంచాలి. అప్పుడు ఆ పాలను పోసి.. గరిటతో అప్పుడప్పుడు కలుపుతూ మరగబెట్టుకోవాలి. 10 నిమిషాల పాటు చక్కగా మరిగించుకుని స్టవ్ ఆఫ్ కపప్పు లోకి వడకట్టుకోండి. ఇలా ఎప్పుడు ప్రిపేర్ చేసిన ఒకే రుచి వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రయత్నించండి. 

Visitors Are Also Reading