Home » ఈ రాశుల అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి.. గయ్యాళి భార్యలుంటారు!

ఈ రాశుల అమ్మాయిలతో జాగ్రత్తగా ఉండాలి.. గయ్యాళి భార్యలుంటారు!

by Anji
Ad

సాధారణంగా వివాహ బంధం బలపడాలంటే భార్యభర్తల మధ్య ఒకరినొకరు అర్థం చేసుకునే గుణం తప్పనిసరిగా ఉండాలి. కొంచెం ప్రేమ.. కొంచెం ఇష్టం లేని చోట ఏ బంధం కూడా బలపడదు. కొన్ని జంటలు మాత్రం ఎంత ప్రయత్నించినా తమ పెళ్లి బంధాన్ని చివరి వరకు కొనసాగించలేరు. అటు భర్త.. ఇటు భార్య ఇద్దరిలో ఎవరో ఒకరూ తమ భాగస్వామిపై పెత్తనం చేలాయించాలనుకుంటారు.తమ మాటనే ఇంట్లో వేదవాక్కుగా నిలవాలని భావిస్తారు. అలాంటి సూపరియారిటీ ఈగోలు ఉన్నవారు తమ బంధాన్ని ముందుకు కొనసాగించలేరు. వారిలో కొంతమంది గయ్యాళి భార్యలుగా కూడా మారే అమ్మాయిలు ఉంటారు. వారిలో ఏయే రాశుల వారున్నారో  ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

Also Read :  Weekly Horoscope in Telugu 2023 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి

మేషరాశి :

మేషరాశికి చెందిన అమ్మాయిలు తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం ఎంత దూరం అయినా వెళ్తారు. భర్తలపై తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తారు. వీరికి షాపింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. అన్ని విషయాల్లో వీరి మాటనే నెగ్గాలి. లేదంటే ఆ బంధం వన్ సైడ్ అయిపోతుంది. వారి మాట విననటువంటి భర్తను కొట్టడానికి కూడా వెనుకాడరు.

సింహరాశి :

Advertisement

ఈ రాశి అమ్మాయిలతో చాలా జాగ్రత్త ఉండాలి. ఎప్పుడూ ఇతరుల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. వారి అసహనం కారణంగా అప్పుడప్పుడూ ఈ రాశి అమ్మాయిలు నిగ్రహం కోల్పోయి కోపోద్రిక్తులు అవుతారు. తమ భాగస్వాములతో తమ కోరికలను ఎలా నెరవేర్చుకోవాలో వీరికి బాగా తెలుసు. సుపీరియారిటీని ప్రదర్శిస్తూ.. తమను తాము బెస్ట్ అని చెప్పుకుంటారు. 

వృశ్చిక రాశి :

ఈ రాశికి చెందిన అమ్మాయిలు తమ ప్రవర్తన రిత్యా చాలా రహస్యాలను బయటికి చెప్పరు. కొన్నిసార్లు వారి నిజమైన ఉద్దేశాలు ఏంటో కూడా తెలియవు. చాలా కేరింగ్, కూల్ అనిపించవచ్చు. కొన్ని నిమిషాల్లోనే తన ఆలోచనలలో మునిగిపోతుంది. తన జీవిత భాగస్వామి విజయాన్ని ఈ రాశి అమ్మాయిలు ఆస్వాదిస్తారు. ఎప్పుడైతే.. ఆమె గెలుపు తన భాగస్వామి విజయంతో ఓవర్ షేడ్ అయినప్పుడు మాత్రం సమస్యలు వచ్చిపడుతాయి. జీవిత భాగస్వామి  వృత్తిపరంగా ఆమెను అధిగమించినట్టయితే ఆమె వారిని హృదయ పూర్వకంగా విషెస్ చెప్పకపోవచ్చు. ఈ రాశికి చెందిన అమ్మాయిలు పెళ్లి తరువాతనే తామే భాగస్వామిపై సూపిరియారిటీని ప్రదర్శించాలని భావిస్తారు. 

ధనస్సు రాశి :

ధనస్సు రాశికి చెందిన అమ్మాయిలు రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు తమ స్వరమే గట్టిగా ఉండాలనుకుంటారు. తమ జీవిత భాగస్వామితో మాట్లాడినప్పుడు వారు తమ అభిప్రాయానికి మద్దతు ఇచ్చేవిధంగా వారిని మార్చుతారు. ముక్కుసూటిగా ఉండే ఈ రాశికి చెందిన అమ్మాయిలు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెబుతారు. అదేవిధంగా తమకు నచ్చినవి జరిగేవిధంగా జీవిత భాగస్వాములను మార్చుతారు. ఈమె తీసుకునే కొన్ని నిర్ణయాలు వారి భాగస్వాములకు అస్సలు నచ్చదు. 

 

Visitors Are Also Reading