Home » మార్చిలో 12 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే..? 

మార్చిలో 12 రోజులు బ్యాంకులు బంద్.. ఎందుకంటే..? 

by Anji
Ad

సాధారణంగా ప్రతినెల బ్యాంకులకు సెలవులను ప్రకటిస్తుంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బ్యాంకులకు సంబంధించిన వివిధ పనులను చేసుకునేందుకు సెలవులను గమనించి ముందుగానే ప్లాన్ చేసుకోవడం ఉత్తమం. నెలలో బ్యాంకులకు ఏయే రోజుల్లో సెలువులు ఉన్నాయో మనం గమనించకుండా ఉంటే.. సమయంతో పాటు కొంత డబ్బు కూడా వృధా అయ్యే అవకాశముంది. ముందస్తుగానే బ్యాంకులకు సెలవులను గమనించి ప్లాన్ చేసుకోవడం బెటర్. 

Advertisement

దేశవ్యాప్తంగా నాలుగు ఆదివారాలు, రెండు శనివారాలు జాతీయ సెలవు దినాలతో పాటు మరో ఆరు రోజులు కూడా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బ్యాంకులు పని చేయవు. మొత్తం 12 రోజుల పాటు మార్చిలో బ్యాంకులకు సెలవులున్నాయి. కాబట్టి బ్యాంకు వినియోగదారులు అలర్ట్ గా ఉండి మీ సమయాన్ని వృధా చేసుకోకుండా బ్యాంకు ఏరోజు ఉంటుందో ఏ రోజు ఉండదో తెలుసుకోవడం మంచిది.  

Also Read :  ఉత్తమ టీ 20 జట్టును ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఒక్కరే..!

Advertisement

మార్చిలో బ్యాంకులకు సెలవులు ఇవే : 

  • మార్చి 03 : శుక్రవారం (చుప్ చార్ కుట్ – త్రిపుర రాజధాని అగర్తాలలో సెలవు) 
  • మార్చి 05 :  ఆదివారం 
  • మార్చి 07 : మంగళవారం (హోలీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, డెహ్రాడూన్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్ కతా, లక్నో, ముంబయి, నాగ్ పూర్, ఫనాజీ, రాంచి, శ్రీనగర్ లలో సెలవు. 
  • మార్చి 08 : బుధవారం (హోలీ) అగర్తాల, ఐజ్వాల్, అహ్మదాబాద్, భోపాల్, భువనేశ్వర్, ఛండీఘడ్, గ్యాంగ్ టక్, ఇంపాల్, కాన్పూర్, లక్నో, న్యూఢిల్లీ,  రాయ్ పూర్, షిల్లాంగ్, సిమ్లాలలో బ్యాంకులకు సెలవు.
  • మార్చి 09 : గురువారం (హోలీ) పాట్నాలో సెలవు
  • మార్చి 11 : రెండో శనివారం
  • మార్చి 12 : ఆదివారం
  • మార్చి 19 : ఆదివారం
  • మార్చి 22 : బుధవారం (తెలుగు నూతన సంవత్సరం, ఉగాది, బీహార్ దివాస్)
  • మార్చి 25 : నాలుగో శనివారం
  • మార్చి 26 : ఆదివారం
  • మార్చి 30 : గురువారం (శ్రీరామనవమి)

Also Read :  మళ్లీ ఉద్యోగులకు ఝలక్ ఇచ్చిన మస్క్.. ఈసారి ఆమెను కూడా..!

Visitors Are Also Reading