Home » ఉత్తమ టీ 20 జట్టును ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఒక్కరే..!

ఉత్తమ టీ 20 జట్టును ప్రకటించిన ఐసీసీ.. భారత్ నుంచి ఒక్కరే..!

by Anji
Ad

ఐసీసీ మహిళా టీ-20 ప్రపంచ కప్ 2023 ఈవెంట్ కి సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి మోస్ట్ వాల్యూబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ ని ప్రకటించింది. ఈ అత్యుత్తమ జట్టులో భారత్ నుంచి కేవలం ఒకే ఒక్క బ్యాటర్ కి చోటు దక్కడం గమనార్హం. అండర్-19 ప్రపంచ కప్ గెలిచిన జట్టులో సభ్యురాలు అయినటువంటి వికెట్ కీపర్ రిచా ఘోష్ ఐసీసీ జట్టులో స్థానం సంపాదించింది. ఈ మెగా టోర్నీలో రిచా 130కి పైగా స్ట్రైక్ రేటుతో 136 పరుగులు చేసింది.  అండర్ 19 కెప్టెన్ షఫాలీ వర్మ వరల్డ్ కప్ ఈవెంట్ లో ఆకట్టుకోలేకపోయింది. 

Advertisement

టీ-20 ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై 31 (నాటౌట్), వెస్టిండీస్ పై  44 (నాటౌట్) ఇంగ్లండ్ పై 47 ( నాటౌట్) సూపర్ ఇన్నింగ్స్ తో అదరగొట్టింది. అదేవిధంగా ఐదు క్యాచ్ లు, రెండు స్టంపింగ్స్ లో రిచా ఘోష్ భాగస్వామ్యం అయింది. ఇదిలా ఉంటే.. మోస్ట్ వాల్యూబుల్ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్ జట్టుకు ఇంగ్లండ్ క్రికెటర్ నాట్ సీవర్ బ్రంట్ కెప్టెన్ గా ఎన్నికైంది. ఈ జట్టులో అత్యధికంగా విజేత ఆస్ట్రేలియాకి చెందిన నలుగురు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. 

Advertisement

ఐసీసీ మహిళా ప్రపంచ కప్ -2023 మోస్ట్ వాల్యుబుల్ టీమ్ 

  1. అలిసా హేలీ  వికెట్ కీపర్ (ఆస్ట్రేలియా) 189 పరుగులు, సగటు 47. 25, నాలుగు డిస్మిసల్స్ 
  2. తజ్మీన్ బ్రిట్స్ (దక్షిణాఫ్రికా) 186 పరుగులు, సగటు 37.20 
  3. లారా వాల్వర్ట్ (దక్షిణాఫ్రికా) 230 పరుగులు, సగటు 46 
  4. నాట్ సీవర్ – బ్రంట్ (ఇంగ్లండ్ కెప్టెన్ ) 216 పరుగులు, సగటు 72 
  5. ఆష్లే గార్డ్ నర్ (ఆస్ట్రేలియా) 110 పరుగులు, సగటు 36.66, 10 వికెట్లు 
  6. రిచాఘోష్ (భారత్ ) 136 పరగులు, సగటు 68 
  7. సోఫీ ఎక్లిస్టోన్ ( ఇంగ్లండ్ ) 11 వికెట్లు 
  8. కరిస్మ రామ్ హరక్ (వెస్టిండీస్) 5 వికెట్లు 
  9. షబ్నిమ్ ఇస్మాయిల్  ( దక్షిణాఫ్రికా) 8 వికెట్లు 
  10. డార్సీ బ్రౌన్ (ఆస్ట్రేలియా) 7 వికెట్లు 
  11. మేగన్ షట్ ( ఆస్ట్రేలియా) 10 వికెట్లు 
  12. ఓర్లా ఫ్రెండర్ గాస్ట్ (ఐర్లాండ్ ) 109 పరుగులు సగటు 27.25

 

Visitors Are Also Reading