Home » జనవరి 01 నుంచి మారనున్న బ్యాంకు నిబంధనలు.. అందుకోసమేనా ?

జనవరి 01 నుంచి మారనున్న బ్యాంకు నిబంధనలు.. అందుకోసమేనా ?

by Anji
Ad

2022 ఏడాది అతి త్వరలోనే ముగిసిపోనుంది. 2023వ సంవత్సరం రాబోతుంది. అలాంటి పరిస్థితిలో నూతన సంవత్సరంతో పాటు మీ బ్యాంకు, ఫైనాన్స్ కి సంబంధించిన పలు విషయాలు మారబోతున్నాయి. ఈ మార్పులు నేరుగా మీ ఆర్థిక విషయాలపై ప్రభావం చూపే అవకాశముంది. జనవరి 01, 2023 నుంచి మారబోయే ఆర్థిక నియమాలు క్రెడిట్ కార్డు, బ్యాంకు లాకర్, జీఎస్టీ ఇ-ఇన్ వాయిసింగ్, సీఎన్జీ, పీఎన్ జీ గ్యాస్ ధరలు, వాహన ధరల పెరుగుదల వంటివి ఉన్నాయి. 

Advertisement

బ్యాంకు లాకర్ కొత్త నియమాలు :

Manam News

రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా జారీ చేసిన కొత్త లాకర్ నియమాలు జనవరి 01, 2023 నుంచి అమలులోకి రానున్నాయి. ఈ నిబంధన అమలులోకి వచ్చిన తరువాత లాకర్ విషయంలో బ్యాంకులు ఖాతాదారులతో ఇష్టారాజ్యంగా వ్యవహరించడం కుదరదు. లాకర్ లో ఉంచిన వస్తువులకు నష్టం జరిగితే.. అప్పుడు బ్యాంకు బాధ్యత ఉంటుంది. ఇది కాకుండా.. ఇప్పుడు వినియోగదారులు డిసెంబర్ 31 వరకు బ్యాంకుతో ఒప్పందంపై సంతకం చేయాలి. దీని ద్వారా లాకర్ నిబంధనలతో మార్పు గురించి ఖాతాదారులు ఎస్ఎంఎస్ ఇతర మార్గాల ద్వారా బ్యాంకుకు తెలియజేయాలి. 

Advertisement

క్రెడిట్ కార్డు నియమాలలో మార్పు :

Manam News

మీరు కూడా క్రెడిట్ కార్డు హోల్డర్ అయితే క్రెడిట్ కార్డు నిబంధనలలో పెద్ద మార్పులు రాబోతుందనే విషయం తెలుసుకోండి. హెచ్డీఎఫ్సీ బ్యాంకు తన క్రెడిట్ కార్డు చెల్లింపుపై అందుకున్న రివార్డు పాయింట్ల నియమాలను మార్చబోనున్నది. డిసెంబర్ 31, 2022లోపు అన్ని రివార్డు పాయింట్లను రీడిమ్ చేసుకోండి. 

జీఎస్టీ ఇ-ఇన్ వాయిసింగ్ నియమాల్లో మార్పులు :

2023 నూతన సంవత్సరం నుంచి జీఎస్టీ ఈ-ఇన్ వాయిసింగ్ లేదా ఎలక్ట్రానిక్ బిల్లు నిబంధనల్లో పెద్ద మార్పు రాబోతుంది. 2023 నుంచి జీఎస్టీ ఇ-ఇన్ వాయిస్ కోసం ప్రభుత్వం రూ.20కోట్ల పరిమితిని రూ.5కోట్లకు తగ్గించింది. ఈ కొత్త నిబంధన జనవరి 01, 2023 నుంచి అమలు చేయబడుతుంది. ఈ పరిస్థితులలో రూ.5కోట్లకు పైగా వ్యాపారం చేసే వ్యాపారులు ఎలక్ట్రానిక్ బిల్లులను రూపొందించుకోవాల్సిన అవసరమేర్పడింది. 

Also Read :   2022లో ఎక్కువగా వెతికిన మూలికలు ఇవే..!

Visitors Are Also Reading