Home » 2022లో ఎక్కువగా వెతికిన మూలికలు ఇవే..!

2022లో ఎక్కువగా వెతికిన మూలికలు ఇవే..!

by Anji
Published: Last Updated on
Ad

ఆయుర్వేదం ప్రకారం.. మూలికలు చాలా రోగాలకు దివ్య ఔషదంగా పరిగణిస్తారు. కరోనా తరువాత కాలంలో దేశీయ మూలికల వాడకం ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోయిందని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో పలు మూలికలు గురించి గూగుల్ లో వెతకడం గురించి ప్రారంభించారు. 2022లో గూగుల్ లో ఎక్కువగా వెతికిన 10 ఆయుర్వేద మూలికల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

Also Read : మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారా..? డైట్ లో ఈ పదార్థాలను చేర్చుకోండి..!

దాల్చిన చెక్క : 

Manam News

2022లో ఎక్కువగా గూగుల్ లో దాల్చిన చెక్క గురించి వెతికారు. దాల్చిన చెక్క ముఖ్యంగా బరువును తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా చర్మ సమస్య నివారణకు కూడా ఉపయోగపడుతుంది. అదేవిధంగా డయాబెటిస్ ఉన్నవారు దాల్చిన చెక్క టీ తాగడం చాలా ఉత్తమం.

వేప :

Manam News

భారతదేశంలో పలు సమస్యలకు వేపను దివ్య ఔషదంగా భావిస్తారు. వేప ఆకులను మెత్తగా నూరి వడగట్టి ఆ నీటిని తాగడం వల్ల కడుపులో ఉన్నటువంటి వ్యర్థాలు తొలగిపోతాయి. ఆకులను తీసుకోవడం వల్ల శరీరంపై దద్దుర్లు, దురదలు తగ్గుతాయి. అదేవిదంగా ఈ ఆకులను గ్రైండ్ చేసుకొని ముఖానికి కూడా రాసుకోవచ్చు.

Also Read :  ఈ విషయాలు తెలిస్తే ఆవాల ఆకులను అస్సలు వదిలిపెట్టరు..!

మాచా గ్రీన్ టీ ఆకులు :

Manam News

Advertisement

మాచా గ్రీన్ టీ లేదా గ్రీన్ టీ ఆకులు శరీర బరువు తగ్గడానికి ప్రభావవంతంగా పని చేస్తాయి. వాస్తవానికి మాచా గ్రీన్ టీ తాగడం వల్ల శరీరానికి నిర్వీషీకరణ చేస్తోంది. అదే సమయంలో దానిలోని బాక్టీరియల్ లక్షణం పలు చర్మ సమస్యలను నివారించడంలో ఉపయోగపడుతుంది.

పసుపు :

Manam News

పసుపు అనేక వ్యాధులకు దివ్య ఔషదంగా పరిగణించబడుతుంది. పసుపులోని యాంటీ బాక్టీరియల్,యాంటీ ఇన్ ప్ల మేటరీ లక్షణాలున్నాయి. రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. పలు వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. జలుబు, ఎముకల సమస్యలను నివారించడానికి దీనిని ఉపయోగించవచ్చు.

సోంపు :

Manam News

 

సోంపు మౌత్ ప్రెషనర్ గా ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసనతో పాటు పలు ఉదర సంబంధిత సమస్యలను నివారించడానికి వినియోగిస్తారు. ఎవరైనా సరే బరువు తగ్గడానికి సోంపు నీటిని తాగవచ్చు. వికారంగా ఉన్నప్పుడు కూడా సోంపును నమిలితే ఫలితం ఉంటుంది.

తిప్ప తీగ :

 

 

సాధారణంగా కరోనా సమయంలో తిప్ప తీగ గురించి చాలా ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేశారు. మామూలుగా తిప్ప తీగను పలు సమస్యల నివారణకు ఉపయోగిస్తుంటారు. తిప్పతీగలో యాంటి బాక్టీరియల్, యాంటి ఇన్ ఫ్లమేటరీ గుణాలున్నాయి. ఇది ఎముకల్లో నొప్పి, వాపు సమస్యను తగ్గిస్తుంది. అంతేకాదు.. ఇది జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనాన్ని కల్పిస్తుంది. అదేవిధంగా రోగనిరోధకశక్తిని పెంచుతుంది.

Also Read :  కుక్కర్ విజిల్ పెట్టే ముందు ఈ విషయాలను తప్పక తెలుసుకోండి..!

Visitors Are Also Reading