Home » IPL 2022 : కోల్​కతాపై బెంగ‌ళూరు విజయం

IPL 2022 : కోల్​కతాపై బెంగ‌ళూరు విజయం

by Anji
Ad

ముంబ‌యి డివై పాటిల్ వేదిక‌గా కోల్‌క‌తాలో జ‌రిగిన మ్యాచ్‌లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ జ‌ట్టు 3 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది. కోల్‌క‌తా నిర్దేశించిన 129 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ త‌గిలింది. ఉమేష్ యాద‌వ్ వేసిన తొలి ఓవ‌ర్ మూడ‌వ బంతికే ఓపెన‌ర్ అనూజ్ రావ‌త్‌ను డ‌కౌట్‌గా పెవిలియ‌న్‌కు చేర్చాడు.

Advertisement

మ‌రొక ఓపెన‌ర్ జ‌ట్టు కెప్టెన్ డుప్లెసిస్(5) ప‌రుగులు చేసి సౌథీ బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంత‌రం క్రీజ్‌లోకి వ‌చ్చిన విరాట్ కోహ్లీ (12) ప‌రుగుల‌కే పెవిలియ‌న్ బాట‌ప‌ట్టాడు. త‌రువాత వ‌చ్చిన డేవిడ్ విల్లే (18) కాస్త ఆడినా.. సునీల్ న‌రైన్ త‌న బంతితో పెవిలియ‌న్‌కు పంపాడు. అహ్మ‌ద్ (27), రూథ‌ర్‌ఫోర్డు (28)ప‌రుగుల వ‌ద్ద ఔట‌య్యారు. హ‌ర్ష‌ల్ ప‌టేల్ (10) నాటౌట్‌, దినేష్ కార్తీక్ (14) నాటౌట్‌గా మ్యాచ్‌ను ముగించారు. అంత‌కు ముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌క‌తా బ్యాట‌ర్లు ఆర్సీబీ బౌల‌ర్ల విజృంభ‌ణ‌కు త‌ట్టుకోలేక‌పోయారు. ఓపెన‌ర్లు అజింక్య ర‌హానే (09), వెంక‌టేష్ అయ్య‌ర్ (10) పెవిలియ‌న్‌కు చేరారు.

Advertisement

ఆ త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్య‌ర్ (13) ప‌రుగులు చేసి హ‌స‌రంగా బంతికి ఔట‌య్యాడు. త‌రువాత వ‌చ్చిన నితీశ్ రానా (10), సునీల్ న‌రైన్ (12) సామ్ బిల్లింగ్స్ (14) వ‌రుస‌గా పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. దీంతో కోల్‌క‌తా స‌గం ఓవ‌ర్లే స‌గానికి పైగా వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. వికెట్ కీప‌ర్ జాక్స్‌న్ (0), హ‌స‌రంగ బౌలింగ్‌లో డ‌కౌట్ అయ్యాడు. త‌రువాత వ‌చ్చిన ఆండ్రీ ర‌స్సెల్ (25) త‌ప్ప మిగ‌తా ఆటగాళ్లంద‌రూ నిరాశ‌ప‌రిచారు. చివ‌రిలో ఉమేష్ యాద‌వ్ (18) ఆడినా ఆకాశ్ దీప్ త‌న బంతితో పెవిలియ‌న్‌కు పంపాడు. వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి (10) నాటౌట్‌గా నిలిచాడు. 18.5 ఓవ‌ర్ల‌లో 128 ప‌రుగులు చేసి ఆలౌట్ అయ్యారు. బెంగ‌ళూరు బౌల‌ర్లు హ‌స‌రంగ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ఆకాశ్ దీప్ 3, హ‌ర్ష‌ల్ ప‌టేల్ 2, సిరాజ్ 1 చొప్పున వికెట్లు తీశారు.

Also Read : పుట్టుక‌తో వ‌చ్చింది కాదు…క‌ళ్లు చితంబ‌రం మెల్ల క‌న్ను వెన‌క అస‌లు స్టోరీ ఇదేన‌ట‌..!

Visitors Are Also Reading