Home » BHEEMLANAYAK : ఆడియో ఫంక్ష‌న్ కు వ‌ద్ద‌న్నాడ‌ట‌.. త్రివిక్ర‌మ్ పై బండ్ల గ‌ణేష్ ఫైర్..ఆడియో వైర‌ల్..!

BHEEMLANAYAK : ఆడియో ఫంక్ష‌న్ కు వ‌ద్ద‌న్నాడ‌ట‌.. త్రివిక్ర‌మ్ పై బండ్ల గ‌ణేష్ ఫైర్..ఆడియో వైర‌ల్..!

by AJAY

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన తాజా చిత్రం భీమ్లానాయ‌క్. ఈ సినిమాకు సాగ‌ర్ కే చంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ చిత్రానికి త్రివిక్ర‌మ్ స్క్రీన్ ప్లే…మ‌రియు మాట‌లు అందించాడు. సినిమాలో రానా కీల‌క పాత్ర‌లో న‌టించారు. మ‌లయాళ సూప‌ర్ హిట్ సినిమా అయ్య‌ప్ప‌నుమ్ కోషియం సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఇక ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ కు భార్య‌గా నిత్యామీన‌న్ న‌టించ‌గా….రానాకు జోడీగా సంయుక్త మీన‌న్ న‌టింటించింది. ఇదిలా ఉండ‌గా ఈ సినిమాను ఈ నెల 25న విడుద‌ల చేస్తున్న‌ట్టు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఈ చిత్ర ఆడియో ఫంక్ష‌న్ ను నేడు సాయంత్రం హైద‌రాబాద్ లో నిర్వ‌హిస్తున్నారు. ఇప్ప‌టికే ఈ సినిమా ఆడియో ఫంక్ష‌న్ కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజ‌రు అవుతున్నట్టు ప్ర‌కటించారు. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ సినిమా అంటే ప్ర‌తి ఒక్క‌రూ బండ్ల గ‌ణేష్ స్పీచ్ కోసం ఎదురు చూస్తార‌న్న సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా భీమ్లా నాయ‌క్ ఆడియో ఫంక్ష‌న్ పై అభిమానితో మాట్లాడిన ఓ ఆడియో వైర‌ల్ అవుతోంది.

ఆడియోలో అభిమాని బండ్ల‌న‌న్నా భీమ్లానాయ‌క్ ఆడియో ఫంక్ష‌న్ వ‌స్తున్నావా అని అడ‌గ్గా వ‌స్తున్నా అంటూ బండ్ల స‌మాధానం ఇచ్చారు. స్పీచ్ రెడీ చేసుకున్నావా అన్నా అంటే హా అని ఆన్స‌ర్ ఇచ్చారు. అయితే త‌న‌ను ఇంకా పిల‌వ‌లేద‌ని..తాను వెళితే త్రివిక్ర‌మ్ హైలెట్ అవ్వ‌న‌ని త‌న‌ని వ‌ద్ద‌ని చెప్పాడ‌ట అంటూ ఫైర్ అయ్యారు.

అంతే కాకుండా త్రివిక్ర‌మ్ వైసీపీ వాళ్ల‌తో క‌లిసి త‌న‌ను రానివ్వ‌కుండా ప్లాన్ చేశాడంటూ బండ్ల గ‌ణేష్ ఆగ్రహం వ్య‌క్తం చేశారు. దాంతో అభిమాని మాత్రం అన్నా నువ్వు రావాలి…నీ స్పీచ్ ఉండాల‌ని కోర‌డంతో మీరు బండ్ల గ‌ణేష్ కావాల‌ని అర‌వండి నేను అక్క‌డే ఉంటే వ‌చ్చి స్పీచ్ ఇస్తా అంటూ స‌మాధానం ఇచ్చారు. ప్ర‌స్తుతం ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. అయితే ఇది ఫేక్ ఆడియో అని కూడా కొంతమంది నెటిజ‌న్లు అంటున్నారు.

Visitors Are Also Reading