Home » కేసీఆర్ పార్టీలో చేరిన బండ్ల గణేష్..? కాళ్ళు మొక్కి మరీ.. !

కేసీఆర్ పార్టీలో చేరిన బండ్ల గణేష్..? కాళ్ళు మొక్కి మరీ.. !

by Bunty
Ad

బండ్ల గణేష్ టాలీవుడ్ లో బడా నిర్మాతగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా ప్రతి రంగంలో ప్రతిభ కనబరుస్తున్నారు. ఇక ఆయన స్పీచ్ లు, అందులో ఉండే ప్రాసలు, పేల్చే బుల్లెట్లు మాటల తుటాలకు అందరూ ఫిదా అవుతుంటారు. పవన్ కళ్యాణ్ భక్తుడు అంటూ గణేష్ ఇచ్చే స్పీచ్ లకు సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు. తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న బండ్ల గణేష్, కరోనా మహమ్మారి సమయంలో చాలామందికి సాయం చేశారు.

read also : విడాకుల కోసం భార్యని టార్చర్ పెడుతున్న స్టార్ హీరో ..?

Advertisement

ఉద్యోగాలు పెట్టించే ప్రయత్నం కూడా చేశారు. అడిగిన వారికి చేతనైనంత డబ్బు కూడా ఇచ్చాడు. అయితే, తాజాగా, బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్ గా మారాయి. బిఆర్ఎస్ పార్టీ ఎంపీ రంజిత్ రెడ్డి కాళ్లు మొక్కారు బండ్ల గణేష్. తాను ప్రస్తుతం ఏ పార్టీలోనని చెప్పుకున్న బండ్ల గణేష్, రంజిత్ రెడ్డి వెనుక ఉన్నానంటూ ప్రకటించారు. రంజిత్ రెడ్డి లేకుండా తాను ఆత్మహత్య చేసుకునే వాడినంటు బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

గురువారం నాడు రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బండ్ల గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి పాదాలకు తాకి నమస్కరించారు బండ్ల గణేష్. రంజిత్ రెడ్డి లేకుంటే ఆత్మహత్య చేసుకునేవాడిని, రంజిత్ అన్న దేవుడితో సమానం. నేను ఏ పార్టీలో లేను. కానీ, రంజిత్ రెడ్డి అన్న వెనుక ఉన్నాను అని బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక బండ్ల గణేష్ వ్యాఖ్యలు విన్న నెటిజన్స్, బిఆర్ఎస్ లో చేరాడని కామెంట్స్ చేస్తున్నారు.

read also : హీరో అబ్బాస్ భార్య ఎంత పెద్ద హీరోయినో తెలుసా…చూస్తే ఫిదా అవ్వాల్సిందే !

Visitors Are Also Reading