Home » విడాకుల కోసం భార్యని టార్చర్ పెడుతున్న స్టార్ హీరో ..?

విడాకుల కోసం భార్యని టార్చర్ పెడుతున్న స్టార్ హీరో ..?

by Bunty
Ad

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం వారసుడు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి చిత్రీకరించారు. అంతేకాకుండా ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించగా, టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రష్మిక మందన హీరోయిన్ గా నటించారు. జనవరి 12న సినిమా విడుదల కానుంది. ఇదిలా ఉండగా, విజయ్ గురించి ఒక షాకింగ్ రూమర్ సౌత్ మొత్తం హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

విజయ్ తన సతీమణి సంగీత నుంచి విడాకులు తీసుకుని విడిపోతున్నారు అంటూ ప్రచారం మొదలైంది. దీనితో విజయ్ అభిమానులు ఆందోళనలో మునిగిపోయారు. అయితే విజయ్, సంగీత గురించి వచ్చిన ఈ న్యూస్ ఫేక్ అని తేల్చేశారు. విజయ్ సన్నిహిత వర్గాలు ఈ పుకార్లపై స్పందించారు. ఈ పుకార్లు పూర్తిగా అవాస్తవం అని తేల్చేశారు.

Advertisement

ఇటీవల చెన్నైలో వారసుడు ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ప్రీ రిలీజ్ వేడుకకు విజయ్ భార్య సంగీత హాజరు కాలేదు. అలాగే దర్శకుడు అట్లీ సతీమణి సీమంతం వేడుకలో కూడా సంగీత కనిపించలేదు. దీంతో విజయ్, సంగీత మధ్య విభేదాలు మొదలయ్యాయా, వీరిద్దరూ దూరంగా ఉంటున్నారా అనే ప్రచారం జోరందుకుంది. అయితే ఇవి పూర్తిగా అసత్యమైన వార్తలు అని తేలింది. సంగీత ప్రస్తుతం తన పిల్లలు, ఇతర కుటుంబ సభ్యులతో యుఎస్ వెకేషన్ కి వెళ్ళిందట. అందువలనే ప్రీ రిలీజ్ వేడుక లాంటి ఫంక్షన్స్ కి హాజరు కాలేకపోయింది అని అంటున్నారు.

read also : హీరో అబ్బాస్ భార్య ఎంత పెద్ద హీరోయినో తెలుసా…చూస్తే ఫిదా అవ్వాల్సిందే !

Visitors Are Also Reading