Home » Unstoppable with NBK : ఏపీ రాజకీయాలపై బాలయ్య పంచ్.. బాగు చేసేందుకు జైలు నుంచి రావాల్సిందే..!

Unstoppable with NBK : ఏపీ రాజకీయాలపై బాలయ్య పంచ్.. బాగు చేసేందుకు జైలు నుంచి రావాల్సిందే..!

by Anji
Ad

నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో.. టాక్ షో లో కూడా కేక పెట్టిస్తున్నారు. అందులో భాగంగానే ఆయన ఆహా ఓటీటీ కోసం అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ఓ టాక్ షోను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో మొదటి సీజన్, రెండో సీజన్ మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంది. ఇప్పటికే ఈ షోకి అటు పొలిటికల్ సెలబ్రీటిస్ తో పాటు సినీ సెలబ్రిటిస్ వచ్చి అలరించారు. చంద్రబాబు, లోకేష్, మహేష్ బాబు, ప్రభాస్ సిద్దు జొన్నల గడ్డ, విశ్వక్ సేన్ ఇలా చాలా మంది ప్రముఖులు వచ్చారు.

Advertisement

లేటెస్ట్ గా మూడో సీజన్ షురూ అయింది. లిమిటేడ్ ఎడిషన్ అంటూ వస్తున్న ఈ సీజన్ కి సంబంధించిన ప్రోమో లేటెస్ట్ గా విడుదలైంది.ఈ ఫస్ట్ ఎపిసోడ్ కి భగవంత్ కేసరి టీమ్ వచ్చింది. ప్రోమో మాత్రం సూపర్ ఫన్ గా సాగుతూ అదురగొట్టింది. బాలయ్య బాబు పంచులతో కేక పెట్టించారు. ఈ ఎపిసోడ్ లో హీరోయిన్స్ కాజల్, శ్రీలీల, దర్శకుడు అనిల్ రావిపూడి, నటుడు అర్జున్ రామ్ పాల్ సరదాగా సందడి చేశారు. అనిల్ రావిపూడికి బాలయ్య వేసిన పంచ్ లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. మోక్షజ్ఞతో మూవీ చేస్తావా అని అడిగారు. చివరగా బాలయ్య ఓ డైలాగ్ తో ముగించేశాడు. సినిమాల్లోనైనా.. జీవితంలోనైనా అంతా బాగున్నప్పుడు ఒకడు దిగుతాడు. మొత్తం నాశనం చేస్తాడు. బాగు చేయడానికి అప్పుడు హీరోలు జైలు నుంచి బయటికీ రావాలంటూ ఓ డైలాగ్ విసిరారు.

Advertisement

ఈ డైలాగ్ ఏపీ రాజకీయాలను టార్గెట్ చేసిందంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం చంద్రబాబు జైలులో ఉన్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తె వైరల్ అవుతోంది. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే  ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 17న సాయంత్రం 6 గంటలకు ఆహాలో ప్రసారం కానుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం బాలకృష్ణ నటించే తాజా మూవీ భగవంత్ కేసరి. దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్ గా విడుదల కాబోతుంది.  ఈ తరుణంలో ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే వరుసా పాటలను విడుదల చేస్తోంది చిత్ర యూనిట్. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ చిత్రం 155 నిమిషాల నిడివి ఉన్నట్టు సమాచారం. అనిల్ రావిపూడి-బాలయ్య కాంబోలో వస్తున్న ఈ చిత్రం ఈ దసరాకి ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో వేచి చూడాలి మరీ.

 మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారు.. వైరల్ అవుతున్న రాజీవ్ కనకాల కామెంట్స్!

రవితేజ మూవీలో రేణుదేశాయ్ పోషించిన హేమలత లవణం పాత్ర గొప్పదనం గురించి తెలుసా ?

Visitors Are Also Reading