Home » రవితేజ మూవీలో రేణుదేశాయ్ పోషించిన హేమలత లవణం పాత్ర గొప్పదనం గురించి తెలుసా ?

రవితేజ మూవీలో రేణుదేశాయ్ పోషించిన హేమలత లవణం పాత్ర గొప్పదనం గురించి తెలుసా ?

by Anji
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది. పవన్ కళ్యాణ్ కి దూరంగా ఉన్నప్పటికీ ఎవరైనా పవన్ కళ్యాణ్ ని ఏమైనా అంటే మాత్రం ఊరుకోదు. ఆమెకు పవన్ కళ్యాణ్ పై ఉన్న ప్రేమ అలాంటిది. బద్రి సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఇక ఆ తరువాత పవన్ కళ్యాన్ జానీ మూవీ తరువాత మళ్లీ మొదటిసారి రేణు దేశాయ్ తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో హేమలత లవణం అనే పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

Advertisement

విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ 20న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ భారీగానే నిర్వహిస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర బృందం కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నటిస్తున్నారని తెలియడంతో ఆమె నటిస్తున్న హేమలత లవణం ఎవరు..? ఆమె గొప్పతనం ఏంటి అనే విషయాల గురించి నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు సినిమా స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో చాలా వరకు నిజ జీవిత కథ ఆధారంగానే కొన్ని పాత్రలను రూపొందించారు. ఈ నేపథ్యంలో హేమలత లవణం పాత్ర కూడా నిజ జీవిత కథ ఆధారంగానే ప్రేక్షకుల ముందుకు రాబోతుందని చెప్పాలి. 

Advertisement

లెజెండరీ రచయిత గుర్రం జాషువా కూతురే హేమలత లవణం. ఈ ఓ సంఘసంస్కర్త కూడా. అదేవిధంగా తండ్రి మాదిరిగా ఓ రచయిత. ఈమె జాతి వివక్షత అంటరాని తనం వంటి వాటిపై కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేసారు. 19వ శతాబ్దంలో తన భర్తతో కలిసి హేమలత.. నేరాలకు పాల్పడే నేరస్థుల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు ఎంతో శ్రమించారు. ఈ తరుణంలోనే స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావుని కూడా ఆమె కలిశారని.. ఈ సన్నివేశాలను కూడా ఈ చిత్రంలో చూపించబోతున్నట్టు తెలుస్తోంది.  ఈ మూవీ ద్వారా రేణుదేశాయ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తరుణంలో ఈమె పాత్రపై కూా భారీ అంచనాలు నెలకొన్నాయి. టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా రవితేజ ఎలాంటి సక్సెస్ సాధించనున్నారు.. హేమలత లవణం పాత్రలో నటించిన రేణు ఎలాంటి గుర్తింపు సంపాదించుకుంటారనే విషయాలు తెలియాలంటే ఈనెల 20 వరకు వేచి ఉండాల్సిందే. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

ఎన్టీఆర్ చేతికి ఉన్న వాచ్ ధర ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

ఆస్కార్‌కి అక్షయ్ కుమార్ ‘మిషన్ రాణిగంజ్’ మూవీ..?

Visitors Are Also Reading