Home » MS Dhoni : లవ్ టుడే హీరోయిన్‌తో ధోని మొదటి సినిమా..

MS Dhoni : లవ్ టుడే హీరోయిన్‌తో ధోని మొదటి సినిమా..

by Bunty
Ad

టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 2004 డిసెంబర్ 23న బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచ్ తో అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన ధోని ఆనతి కాలంలోనే స్టార్ క్రికెటర్ గా ఎదిగాడు. తర్వాత ఏడాది టెస్టుల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చి జట్టులో తనస్థానం సుస్థిరం చేసుకున్నాడు. పాకిస్తాన్ పై ఆడిన 183 పరుగుల ఇన్నింగ్స్ తో ధోని ఇండియన్ టీం లో ఒక సెన్సేషన్ గా మారాడు. ఇక క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన ధోని ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు.

Advertisement

అయితే ధోని గతేడాది అక్టోబర్ లో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నట్టు తెలిపాడు. కోలీవుడ్ లో చిత్రాలను నిర్మించనున్నట్టు చెప్పాడు. ధోని ఎంటర్టైన్మెంట్ పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్ ను లాంచ్ చేశాడు. తాజాగా కొత్త సినిమాలు ప్రకటించాడు. ప్రాజెక్ట్ కు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకున్నాడు. ధోని ఎంటర్టైన్మెంట్స్ ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ టైటిల్ తో కొత్త సినిమాను ప్రకటించింది. ఈ చిత్రంలో హరీష్ కళ్యాణ్, ఇవానా హీరో, హీరోయిన్లుగా నటించినున్నారు.

రమేష్ తమిళమని దర్శకత్వం వహించనున్నాడు. ఈ మూవీ షూటింగ్ జనవరి 27న ప్రారంభమైంది. లో బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది. హరీష్ కళ్యాణ్ ‘ప్యార్, ప్రేమ, కాదల్’ తో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. లవ్ టుడే తో ఇవానా ఈ మధ్య బంపర్ హిట్ కొట్టింది. ధోని ఎంటర్టైన్మెంట్ కొత్త సినిమా టైటిల్ ను ప్రకటిస్తూ అందుకు సంబంధించిన గ్లింప్స్ ను నెటిజన్స్ తో పంచుకుంది. ధోని ఎంటర్టైన్మెంట్ మొదటి సినిమా గ్లింప్స్ ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ ఫస్ట్ గ్లింప్స్ ను మీతో పంచుకున్నందుకు సంతోషంగా ఉంది అని ఆ సంస్థ పేర్కొంది.

read also : అక్కినేని-తొక్కనేని మాటలపై స్పందించిన బాలయ్య..అవి ఫ్లోలో వచ్చిన మాటలు !

Visitors Are Also Reading