Telugu News » Blog » అక్కినేని-తొక్కనేని మాటలపై స్పందించిన బాలయ్య..అవి ఫ్లోలో వచ్చిన మాటలు !

అక్కినేని-తొక్కనేని మాటలపై స్పందించిన బాలయ్య..అవి ఫ్లోలో వచ్చిన మాటలు !

by Bunty
Ads

ఇటీవల నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమా విజయోత్సవ సభలో సంచలన కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. బాలకృష్ణ స్పీచ్ లో మాట్లాడుతూ షూటింగ్ లో నాన్నగారు, ఆ రంగారావు, ఈ రంగారావు అక్కినేని, తొక్కినేని ఇవే మాట్లాడుకునే వాళ్ళం అంటూ వ్యాఖ్యానించారు. కాగా బాలకృష్ణ చేసిన వాక్యాలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. బాలయ్య చేసిన కామెంట్లపై ఇప్పటికి అక్కినేని వారసుడు నాగచైతన్య స్పందిస్తూ, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

Advertisement

READ ALSO : ఏపీ విద్యార్థులకు బిగ్ అలర్ట్ : ప్రవేశ పరీక్షల షెడ్యూల్ 2023 విడుదల, ఎంసెట్ పరీక్ష ఎప్పుడంటే ?

ఇది ఇలా ఉండగా అక్కినేని, తొక్కినేని మాటలు పై స్పందిం చారు బాలకృష్ణ.  హిందూపురం సరస్వతీ విద్యా మందిర్ లో కంప్యూటర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ…అనంతరం మీడియాతో మాట్లాడారు.  ఇండస్ట్రీకి రెండు కళ్ళలాంటివారు నాన్నగారు, అక్కినేని నాగేశ్వరరావు అని, నాన్నగారు నేర్పిన క్రమశిక్షణ, బాబాయ్ నుంచి పొగడ్తలకు దూరంగా ఉండడం అన్న విషయాన్ని నేర్చుకున్నాను అని వెల్లడించారు బాలయ్య.  ఫ్లోలో వచ్చే మాటలను వ్యతిరేకంగా ప్రచారం చేస్తే నాకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.

Advertisement

నాగేశ్వరరావుగారు తన పిల్లల కంటే ఎక్కువగా నన్ను ప్రేమించే వారని, నాన్న పరమపదించిన అనంతరం ఆయన పేరుతో ఏర్పాటు చేసిన జాతీయ అవార్డును మొట్టమొదటిసారిగా అక్కినేని నాగేశ్వరరావు గారికి అందించడం జరిగిందని తెలియజేశారు. బాబాయ్ అక్కినేని నాగేశ్వరరావుపై ప్రేమ గుండెల్లో ఉంటుందని, బయట ఏం జరిగినా నేను పట్టించుకోనని స్పష్టం చేశారు బాలయ్య. ఇక బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Advertisement

READ ALSO : Ravanasura Movie : ‘రావణాసుర’ నుంచి మాస్ గ్లింప్స్ రిలీజ్.. ఫ్యాన్స్ కు పూనకాలే