Home » ‘వీరసింహారెడ్డి’ థియేటర్ వద్ద మేకపోతును బలిచ్చిన బాలయ్య అభిమానులు.. ఎక్కడంటే..?

‘వీరసింహారెడ్డి’ థియేటర్ వద్ద మేకపోతును బలిచ్చిన బాలయ్య అభిమానులు.. ఎక్కడంటే..?

by Anji
Ad

నందమూరి నటసింహా బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రం ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది. పక్కా మాస్ కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం బాగా నచ్చుతుందని.. బాలయ్య అభిమానులకు అయితే పండుగ లాంటి సినిమా అని పేర్కొంటున్నారు. వీరసింహారెడ్డి సినిమా విడుదల సందర్భంగా ఏపీలోని చాలా ఏరియాలలో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. హైదరాబాద్ నగరంలో అయితే కొన్ని థియేటర్లలో అర్థరాత్రి నుంచే స్పెషల్ షోలతో థియేటర్లు దద్దరిల్లాయి. కూకట్ పల్లి బ్రమరాంబ థియేటర్ లో బాలయ్య వీరసింహారెడ్డి సినిమాను వీక్షించారు. ఈ సందర్భంగా బాలయ్యను చూసిన అభిమానులు డప్పుల మోతతో, టపాసులు పేల్చి సంబురాలు జరుపుకున్నారు. 

Advertisement

ఇక తిరుపతిలోని ప్రతాప్ థియేటర్ వద్ద బాలకృష్ణ అభిమానులు ఏకంగా మేకపోతునే బలిచ్చారు. అభిమానుల అరుపులు, కేకల మధ్య మేకపోతును బలి ఇచ్చి బాలయ్య దిష్టితీశారు. మామూలుగా పండుగలు, జాతర సమయంలో అమ్మవారి ఆలయాల వద్ద మేకపోతులను బలివ్వడం మనం చూస్తుంటాం. కానీ సినిమా థియేటర్ల వద్ద ఓ స్టార్ హీరో అభిమానులు మేకపోతును బలి ఇవ్వడం చాలా కొత్తగా ఉందనే చెప్పాలి. గతంలో కూడా ఒంగోలు, నెల్లూరు, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోని థియేటర్ల వద్ద ఇలాంటి సంఘటనలు కనిపించాయని పలువురు పేర్కొంటున్నారు. 

Advertisement

Also Read :  దర్శకుడు బాబి లవ్ స్టోరీలో ఎన్ని ట్విస్ట్ లు ఉన్నాయంటే.. మీరు అస్సలు నమ్మలేరు..?

Manam News

 

ఇక సినిమా విషయానికొస్తే వీరసింహారెడ్డి 2023 సంక్రాంతికి బీ, సీ సెంటర్లలో దుమ్ము లేపడం ఖాయంగా కనిపిస్తోంది. స్వతహాగా బాలయ్య అభిమాని అయినటువంటి గోపించంద్ మలినేని ఓ అభిమానికి నచ్చేవిధంగా అన్ని మసాలాలు మేళవించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాలయ్య నటన, డైలాగ్ లు అద్భుతమనే చెప్పవచ్చు. బాలయ్యతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, హనీరోజ్ తమదైన నటనతో ఆకట్టుకున్నారు. ఈ సినిమాలో చెల్లెలు సెంటిమెంట్ ఉండడంతో చివరలో కొంత మందికి  సెంటిమెంట్ నచ్చడం లేదు. ఓవరాల్ గా చూస్తే వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి పండుగకి తప్పకుండా చూడాల్సిన సినిమా అనే చెప్పవచ్చు. కలెక్షన్లను ఏ రేంజ్ లో వసూలు చేస్తుందో వేచి చూడాలి మరి. 

Also Read :  Veera Simha Reddy Review in Telugu: “వీర సింహారెడ్డి” రివ్యూ..రికార్డులు బద్దలు కొడుతున్న బాలయ్య

Visitors Are Also Reading