Home » Balayya : గ్లోబల్ లయన్ గా వచ్చేసిన బాలయ్య

Balayya : గ్లోబల్ లయన్ గా వచ్చేసిన బాలయ్య

by Bunty
Ad

నందమూరి బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గత ఏడాది అఖండ మూవీతో దుమ్ములేపిన బాలయ్య బాబు… ఈ ఏడాది మొదట్లోనే వీరసింహారెడ్డి సినిమాతో చిత్ర పరిశ్రమను షేక్ చేసేసాడు. ఈ రెండు సినిమాలు మాస్ యాంగిల్ లో వచ్చిన సంగతి తెలిసిందే. దానికి తగ్గట్టుగానే బాలయ్య బాబు నటించి రెండు వరసహిట్లను అందుకున్నాడు. ఇక ఇప్పుడు టాలీవుడ్ స్టార్ దర్శకుడు అనిల్ రావుపూడి తో బాలయ్య బాబు సినిమా చేస్తున్నాడు.

Advertisement

NBK 108 పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ షరావేగంగా జరుగుతోంది. ఇక ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ మరియు యంగ్ హీరోయిన్ శ్రీ లీల బాలయ్య సరసన స్టెప్పులు వేయనున్నారు. ఈ సినిమా కామెడీ మరియు యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు సమాచారం. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్ పై క్రేజీ అప్డేట్ వచ్చింది. బాలయ్య బాబు నటిస్తున్న ఈ సినిమాకు గ్లోబల్ లయన్ అనే పవర్ఫుల్ టైటిల్ ను అనౌన్స్ చేశాడు అనిల్ రావుపూడి.

Advertisement

జూన్ 8వ తేదీన అంటే రేపు ఈ సినిమా టైటిల్ అనౌన్స్ చేస్తానని ముందు ప్రకటించారు. అయితే ఏమైందో తెలియదు కానీ చివరికి ఇవాళ సాయంత్రం అనౌన్స్ చేసేసాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఇక ఈ అప్డేట్ రావడంతో బాలయ్య ఫ్యాన్స్ ఫుల్ ఖుషి గా ఉన్నారు. బాలయ్య బర్త్డే కంటే ముందే రావడంతో ఇప్పుడే సెలబ్రేషన్స్ మొదలుపెట్టేశారు ఫ్యాన్స్.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

తెలంగాణలో వారందరికీ లక్ష రూపాయలు… ఇలా అప్లై చేసుకోండి

Custody : నాగచైతన్య కస్టడీ మూవీ OTT రిలీజ్ డేట్ ఫిక్స్

నీ బట్టతల మీద వెంట్రుకల కంటే నా దగ్గరున్న డబ్బే ఎక్కువ… సెహ్వాగ్‌తో షోయబ్ అక్తర్ కామెంట్!

Visitors Are Also Reading