Home » బస్ డ్రైవర్ కాబోతున్న బాలకృష్ణ.. అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా..!!

బస్ డ్రైవర్ కాబోతున్న బాలకృష్ణ.. అనిల్ రావిపూడి మామూలోడు కాదుగా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఒక ప్రత్యేకమైనటు వంటి గౌరవం ఉంటుంది. తారక రామారావు నటవారసత్వాన్ని అంది పుచ్చుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు బాలకృష్ణ. తనదైన స్టైల్ లో సినిమాల్లో చేస్తూ లక్షలాది మంది అభిమానులు సంపాదించుకున్నారు. అలాంటి బాలకృష్ణ ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో పాతాళానికి పడిపోయారు.. ఇక తన కెరియర్ అయిపోయింది అనుకున్న సమయంలోనే దర్శకుడు బోయపాటి శ్రీను తో అఖండ మూవీ చేసి కం బ్యాక్ అయ్యారు.

Advertisement

Also Read:గంభీర్ పై కోహ్లీ ఫ్యాన్స్ దాడి… ఏకంగా వాటితోనే!

ఈ సినిమా ఆయన కెరియర్ లోనే అతిపెద్ద విజయం సాధించింది. మళ్లీ బాలకృష్ణను హిట్ ట్రాక్ ఎక్కించింది. ఇక ఆ తర్వాత 2023 సంక్రాంతి కానుకగా వచ్చిన వీరసింహారెడ్డి మరో బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఈ విధంగా ఆరు పదుల వయసులో కూడా సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్న బాలకృష్ణ త్వరలో తన 108వ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఈ సినిమా చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మూవీలో బాలకృష్ణ బస్సు డ్రైవర్ కనిపించబోతున్నారట.

Advertisement

Also Read:Upasana : మదర్స్ డే రోజున బేబీ బంప్ తో ఉపాసన… ఫోటో వైరల్

ఇందులో ఆయన రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని, ఈ సినిమాకు సంబంధించిన టీజర్ బాలకృష్ణ బర్త్ డే కానుకగా జూన్ 10న రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ తరహా సినిమా అప్పట్లో బాలయ్య లారీ డ్రైవర్ లో సినిమా చేశారు. అది సూపర్ హిట్ అయింది. అందులో విజయశాంతి బాలయ్య జంటగా నటించారు. బాలకృష్ణ 108వ చిత్రానికి టైటిల్ ఇంకా ఫైనల్ కాలేదు. ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన కాజల్ నటిస్తోంది.

Also Read:ఛీ…ఛీ….రంభ చేసిన పని వల్ల నరకం అనుభవించిన తండ్రి..!

Visitors Are Also Reading