Home » గంభీర్ పై కోహ్లీ ఫ్యాన్స్ దాడి… ఏకంగా వాటితోనే!

గంభీర్ పై కోహ్లీ ఫ్యాన్స్ దాడి… ఏకంగా వాటితోనే!

by Bunty
Ad

ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా లక్నో సూపర్ జేయింట్స్ తో శనివారం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. పేలవ బౌలింగ్ తో 180 పరుగుల స్కోర్ ను కాపాడలేక సునాయాసంగా గెలవాల్సిన మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన మార్కరమ్ బ్యాటింగ్ లో 20 పరుగులు తక్కువగా చేయడం ఓటమికి కారణమైందన్నాడు.

Advertisement

ఇది ఇలా ఉండగా, ఈ ఐపిఎల్ లో తోలుత సౌరవ్ గంగూలీతో వివాదాస్పదంగా ప్రవర్తించిన విరాట్ ఆ తర్వాత గౌతమ్ గంభీర్ తో కయ్యానికి కాలు దువ్వాడు. గంభీర్ కూడా కోహ్లీతో బాహాబాహీకి దిగడం వివాదాస్పదంగా మారింది. అయితే తాజాగా హైదరాబాద్ తో లక్నో ఆడుతున్న మ్యాచ్ లోను అదే రిపీట్ అయింది. ఈ మ్యాచ్ సందర్భంగా కొందరు కోహ్లీ అభిమానులు గంభీర్ ను టార్గెట్ చేసుకొని లక్నో డగౌట్ పై నీళ్ల సీసాలు విసిరారు.

Advertisement

అంతేకాదు నట్స్, బొల్ట్స్ ను కూడా లక్నో ప్లేయర్లు, కోచింగ్ స్టాఫ్ కూర్చున్న చోటకు విసిరారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరికొన్ని వీడియోల్లో గంభీర్ గ్రౌండ్ లోకి వస్తుండగా సన్రైజర్స్ ఫ్యాన్స్ కోహ్లీ… కోహ్లీ అంటూ అరుస్తూ కనిపించారు. మ్యాచ్ ఎస్ఆర్హెచ్, లక్నో మధ్య జరిగితే ఇలా కోహ్లీ…కోహ్లీ అంటూ అరవడం, గంభీర్ ను టార్గెట్ గా చేసుకునే వాటర్ బాటిల్స్, నట్స్, బొల్ట్స్ విసరడం చర్చనీయాంశంగా మారింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

‘కస్టడీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్… స్ట్రీమింగ్ అప్పటి నుంచే!

  ఏపీ ప్రభుత్వ ఆసుపత్రిలో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు… లక్ష జీతం

Suryakumar Yadav : సూర్య బ్యాటింగ్ చూసి సచిన్ షాక్… వీడియో వైరల్

Visitors Are Also Reading