నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఏ రేంజ్ సక్సెస్ ను చూశారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్టీఆర్ నటవారసుడిగా ఎంట్రీ ఇచ్చి ప్రశంసలు అందుకున్నారు. స్టార్ హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించారు. ఇక బాలయ్య ఇప్పుడు హోస్ట్ గానూ అదరగొడుతున్నారు. ఆహాలో బాలయ్య హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఎవరూ ఊహించని విధంగా అలరిస్తున్నారు. ముక్కుసూటి ప్రశ్నలు….సరదా ముచ్చట్లతో అన్ స్టాపబుల్ టాక్ షోతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంటున్నారు.
Advertisement
Also Read: హరిహరవీరమల్లు టీజర్ వచ్చేది ఎప్పుడో తెలుసా..?
ఇప్పటి వరకూ ఎన్నో టాక్ షోలు వచ్చాయి కానీ అన్ స్టాపబుల్ రేంజ్ లో ఏ టాక్ షో కూడా హిట్ అవ్వలేదు. ఇక బాలయ్య షో కావడంతో పెద్ద స్టార్ లు సైతం ఆ షో లో సందడి చేస్తున్నారు. దర్శకులు నిర్మాతలు హీరోలు ఇలా టాలీవుడ్ దిగ్గజాలు అందరూ టాక్ షో లో కనిపిస్తున్నారు.
Advertisement
ఇటీవల ప్రభాస్ ఈ షో కు రాగా ఆహా సర్వర్ లు సైతం డౌన్ అయ్యాయి. అంటే ఈ షో రేంజ్ ఎక్కడికి వెళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక తాజాగా ఈ షోలో పవన్ కల్యాన్ కూడా సందడి చేశారు. పవన్ కల్యాణ్ అన్ స్టాపబుల్ షో కు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. పవన్ కల్యాణ్ బాలయ్య లుక్ ఆకట్టుకుంటోంది. పవన్ రాగానే బాలయ్య వెల్ కమ్ చెప్పారు. ఇక ఈ ఎపిసోడ్ లో బాలయ్య పవన్ ల మధ్య ఏపీ పాలిటిక్స్ గురించి ఆసక్తికర చర్చ జరిగిననట్టు తెలుస్తోంది.
ఇక ప్రోమోలో బాల అని అందరూ పిలుస్తారని బాలయ్య చెప్పగా నేను ఓడిపోయినా అలా అనను అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. చిరు దగ్గర నుండి వద్దను కున్నవి ఏంటి నేర్చుకున్నవి ఏంటి అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మీ ఫ్యాన్ కానివాడు లేడు. ఆ ప్రేమ ఓట్లుగా ఎందుకు మారలేదని బాలయ్య ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నలకు పవన్ ఏమని సమాధానం చెబుతారో తెలియాలంటే ఎపిసోడ్ వచ్చేవరకూ వెయిట్ చేయాల్సిందే.
Advertisement
AlSO READ :ఉమేష్ యాదవ్ ను మోసం చేసిన మేనేజర్, స్నేహితుడని చేరదీస్తే, నమ్మకద్రోహం!