Home » హరిహరవీరమల్లు టీజర్ వచ్చేది ఎప్పుడో తెలుసా..?

హరిహరవీరమల్లు టీజర్ వచ్చేది ఎప్పుడో తెలుసా..?

by Anji
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా పవర్ స్టార్ జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి  ఎక్కువగా నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. ఓ వైపు రాజకీయాల్లో  రాణిస్తూనే మరోవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం హరి హర వీరమల్లు సినిమాపై భారీ లేవల్ లో అంచనాలు వేసుకున్నారు. నిన్న మొన్నటి వరకు ఈ చిత్రంపై అంతగా బజ్ లేదు. ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ కి కూడా ఇప్పటివరకు కమర్షియల్ గా పెద్దగా హిట్ లేదనే చెప్పాలి. క్రిష్ దర్శకత్వం వహించిన గౌతమిపుత్ర శాతకర్ణి మినహా మిగతా సినిమాలన్నీ యావరేజ్ గానే ఆడాయి. 

Advertisement

హరిహర వీరమల్లు కి సంబంధించిన ఫస్ట్ లుక్, టైటిల్ గ్లింప్స్ అభిమానులను అంతగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే పవన్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన టీజర్ ఒక్కసారిగా భారీ అంచనాలను పెంచేసింది. ఎంతలా అంటే.. బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు హిందీ హక్కుల కోసం కోట్ల ఆపర్ చేసేంతగా ఈ సినిమాపై ఒక్క టీజర్ తోనే భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.  

Advertisement

Also Read :  బాలయ్య కంటే చిరు మార్కెట్ ఎక్కువగా ఉండడానికి 2 కారణాలున్నాయి.. ఏంటంటే..?

తాజాగా ఈ చిత్రం టీజర్ కి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అనగా జనవరి 26, 2023న హరి హర వీరమల్లు టీజర్ ని విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. 17వ శతాబ్ధం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల కాలం నాటి కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రిలు నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏ. దయాకర్ రావు అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. 

Also Read :   రానా దగ్గుబాటి సినిమాలు ఇక లేనట్టేనా.. అసలు కారణం తెలిస్తే..?

Visitors Are Also Reading