Home » ఉమేష్ యాదవ్ ను మోసం చేసిన మేనేజర్, స్నేహితుడని చేరదీస్తే, నమ్మకద్రోహం!

ఉమేష్ యాదవ్ ను మోసం చేసిన మేనేజర్, స్నేహితుడని చేరదీస్తే, నమ్మకద్రోహం!

by Bunty
Ad

టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ కు బిగ్ షాక్ తగిలింది. స్నేహితుడని నమ్మి పని ఇస్తే నట్టేట ముంచాడు. ఫ్లాట్ కొనుగోలు పేరిట ఉమేష్ యాదవ్ ను బురిడీ కొట్టించి రూ. 44 లక్షలు ఎగనామం పెట్టాడు. విషయంలోకి వెళితే, మహారాష్ట్రలోని నాగపూర్ లోని కోరాడి పట్టణానికి చెందిన శైలేష్(37) తో ఉమేష్ యాదవ్ కు ఎంతో కాలంగా స్నేహం ఉంది.

Advertisement

శైలేష్ కు ఉద్యోగం లేకపోవడంతో ఉమేష్ తన మేనేజర్ గా జూలై 2014లో నియమించుకున్నాడు. ఎంతో నమ్మకంగా ఉండటంతో శైలేష్ కు ఆర్థిక వ్యవహారాలు కూడా అప్పగించాడు. ఉమేష్ యాదవ్ బ్యాంకు ఖాతాలు, ఆదాయ పన్ను లావాదేవీలు, ఇతర ఆర్థిక వ్యవహారాలన్నీ శైలేష్ చక్కగా పెట్టేవాడు. ఈ క్రమంలో రూ. 44 లక్షలకే భూమి ఇప్పిస్తానని ఉమేష్ ను నమ్మించి ఆ ఫ్లాట్ ను తన పేరిట రిజిస్టర్ చేయించుకున్నాడు.

Advertisement

ఈ విషయం తెలుసుకుని క్రికెటర్ ఉమేష్ యాదవ్ నివ్వేరపోయాడు. నమ్మిన స్నేహితుడే తనను మోసం చేశాడని తెలిసి ఆవేదనకు గురయ్యాడు. తన డబ్బు తిరిగి ఇవ్వాలని శైలేష్ ను కోరాడు. అయితే డబ్బు ఇవ్వడానికి శైలేష్ నిరాకరించడంతో ఉమేష్ యాదవ్ పోలీసులను ఆశ్రయించారు. ఉమేష్ యాదవ్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. ఐపీసీ సెక్షన్లు 406, 420 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

READ ALSO : హైదరాబాద్ కు విప్లవ దివిటి చేగువేరా కూతురు, మనవరాలు, ఎందుకొచ్చారంటే?

Visitors Are Also Reading