Home » జైలర్ మూవీని మిస్ చేసుకున్న టాలీవుడ్ బాడా హీరో ఎవరో తెలుసా..?

జైలర్ మూవీని మిస్ చేసుకున్న టాలీవుడ్ బాడా హీరో ఎవరో తెలుసా..?

by Mounika
Published: Last Updated on
Ad

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన జైలర్ మూవీ ఈ గురువారం థియేటర్స్ లో విడుదలై భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ రిలీజ్ అయిన మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో సినీ ప్రేక్షకులు మరియు రజిని అభిమానులు థియేటర్లకు క్యూ కడుతున్నారు.. రజినీ కెరీర్‌లో ఎన్నో సినిమాలలో నటించినప్పటికీ జైలర్‌లో సూపర్ స్టార్ రజనీకాంత్ డిఫరెంట్‌గా కనిపించి ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకున్నాడు. సాధారణంగా రజినీ సినిమా అంటే భారీ యాక్షన్ సీన్లు…మాస్ డైలాగులుఉంటాయని ప్రేక్షకులు ఖచ్చితంగా ఆశిస్తారు.

Advertisement

 

కానీ జైలర్ మూవీలో రజినీ తండ్రి పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గెస్ట్ ఆపీరియన్స్ లో కీలక పాత్రలు పోషించారు.  జైలర్ మూవీ తెలుగులో కూడా విడుదలైనప్పటికీ  మన టాలీవుడ్ నుంచి అలాంటి స్టార్ అప్పియరెన్స్ కనిపించలేదు. కానీ మొదటిగా ఒక పవర్‌ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటసింహం నందమూరి బాలకృష్ణను తీసుకుందామని మూవీ యూనిట్ భావించారట. కానీ బాలకృష్ణను చిత్రంలో నటింపజేయడం కుదరలేదని జైలర్ మూవీ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

Advertisement

 

జైలర్ లో దర్శకుడు నెల్సన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో టాలీవుడ్ స్టార్ బాలయ్య బాబును తీసుకోవాలని అనుకున్నారట. ఒకవేళ ఈ పాత్ర నందమూరి బాలకృష్ణ చేసి ఉంటే సినిమా వేరే లెవెల్ లో ఉంటుంది. అనిరుథ్ రవిచందర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో శివరాజ్ కుమార్, మోహన్ లాల్‌తో పాటు నందమూరి బాలకృష్ణ కూడా నటించి ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లలో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ దద్దరిల్లిపోయేవని నెల్సన్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నెల్సన్ చేసిన కామెంట్స్ నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

దాంతో బాలయ్య బాబు కనుక జైలర్ లో నటించి ఉంటే సినిమా నెక్స్ట్ లెవల్ ఉండేదని అభిమానులు కామెంట్స్ ద్వారా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బాలయ్య కూడా వరుస హిట్లతో ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఈ సినిమా బాలయ్య నటించి ఉంటే టాలీవుడ్ లో కలెక్షన్స్ కూడా ఇంకా ఎక్కువ వచ్చేవని అభిప్రాయాలు వెళ్లడవుతున్నాయి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

ప్రభాస్‌ ను…ఆడవాళ్లను నలిపేసినట్లు నలిపేస్తా.. నటి సంచలన వ్యాఖ్యలు !

టబు చీర ఇస్త్రీ నుంచి… 280 కోట్ల ఆస్తికి ఎదిగిన స్టార్ డైరెక్టర్….!

Bholaa Shankar Review : భోళా శంకర్ రివ్యూ.. మెగాస్టార్‌ కు షాక్‌ తప్పదా ?

 

Visitors Are Also Reading