Home » టబు చీర ఇస్త్రీ నుంచి… 280 కోట్ల ఆస్తికి ఎదిగిన స్టార్ డైరెక్టర్….!

టబు చీర ఇస్త్రీ నుంచి… 280 కోట్ల ఆస్తికి ఎదిగిన స్టార్ డైరెక్టర్….!

by Bunty
Ad

 

స్టార్ డైరెక్టర్ రోహిత్ శెట్టి గురించి అందరికీ సుపరిచితమే. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు, బాధలు ఎదుర్కొని ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. ఇతని మొట్టమొదటి పారితోషికం కేవలం 35 రూపాయలు మాత్రమే. అంతేకాకుండా ఇతను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో టబు చీరలను ఐరన్ కూడా చేసేవాడు.

Advertisement

సినిమాలపై ఉన్న ఇష్టం తోనే ఎలాగైనా ఇండస్ట్రీలో రాణించాలని ఎంతటి కష్టమైనా పనినైనా చేసేవాడు. అలా అతను 17 ఏళ్ల వయస్సులోనే “ఫొల్ ఆర్ కాంటే” సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు. ఈ సినిమా భారీ సూపర్ హిట్ అయింది. అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి నుంచి అంచెలంచలుగా ఎదిగి స్టార్ డైరెక్టర్ గా మారాడు. ఇక రోహిత్ శెట్టి దర్శకత్వంలో ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ‘సూర్యవంశీ’ సినిమా సూపర్ హిట్ అయింది.

Advertisement

actress tabu

actress tabu

ఈ సినిమాలో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించారు. ఇక అలా రోహిత్ శెట్టి ఎప్పుడూ సమయం దొరికిన ఏదో ఒక పనిలో మునిగి తేలుతుంటారు. ఇతను ఒక సంవత్సరానికి గాను 35 నుంచి 45 కోట్ల వరకు ఆస్తిని సంపాదిస్తాడు. రోహిత్ శెట్టి మొత్తం ఆస్తి విలువ దాదాపు 280 కోట్లకు పై మాటే. అలాగే ఒక సినిమాకి దర్శకత్వం వహించినందుకు గాను 25 కోట్లను పారితోషకంగా తీసుకుంటారట.

ఇవి కూడా చదవండి : 

RGV : వ్యూహం సినిమాలో సీఎం కేసీఆర్…అదిరిందయ్యా వర్మ !

సినిమా నాశనం చేశారు.. చిరంజీవిపై శ్రీరెడ్డి సీరియస్‌ !

Bholaa Shankar : శ్రీముఖితో చిరంజీవి ఘాటు రొ***న్స్‌..ముసలోడంటూ కామెంట్స్‌ !

Visitors Are Also Reading