Home » Bholaa Shankar Review : భోళా శంకర్ రివ్యూ.. మెగాస్టార్‌ కు షాక్‌ తప్పదా ?

Bholaa Shankar Review : భోళా శంకర్ రివ్యూ.. మెగాస్టార్‌ కు షాక్‌ తప్పదా ?

by Bunty
Ad

మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయనకు ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. సెకండ్ ఇన్నింగ్స్ లో స్ట్రేయిట్ సినిమాల కంటే రీమేక్ కథలను ఎక్కువగా నమ్ముకుంటున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఖైదీ నెంబర్ 150, లూసీఫర్ తర్వాత చిరంజీవి నటించిన రీమేక్ మూవీ ‘భోళాశంకర్’. తమిళంలో విజయవంతమైన వేదాళం ఆధారంగా రూపొందిన ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహించాడు. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా భాటియా హీరోయిన్‌ గా, కీర్తీ సురేష్‌ చెల్లిలుగా నటించింది. ఇక ఇవాళ ఈ సినిమా రిలీజ్‌ అయింది. మరి రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Advertisement

కథ మరియు వివరణ :

శంకర్ (చిరంజీవి) కోల్కత్తాలో తన చెల్లితో జీవిస్తూ ఉంటాడు. ఇక బ్రతుకుతెరువు కోసం టాక్సీ నడుపుతూ ఉంటాడు. అయితే సిటీలోని హౌరా బ్రిడ్జి దగ్గర వరుసగా అమ్మాయిలు కిడ్నాప్ అవుతూ ఉంటారు. ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో పోలీసులు సతమతమవుతూ ఉంటారు. ఇక చేసేదేమీ లేక పోలీసులు శంకర్ సహాయం తీసుకుంటారు. శంకర్ రంగంలోకి దిగాక అసలు శంకర్ ఎవరు అనేది తెలుస్తుంది. అసలు శంకర్ ఎవరు? తాను కలకత్తాలో ఎందుకు ఉంటున్నాడు అనేది తెలుసుకోవాలంటే మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే ఓ ఇంటర్నేషనల్ గ్యాంగ్, వారిని ఎదిరించి పోరాడే ఓ రౌడీ షీటర్ అనే కాన్సెప్ట్ వేదాళం టైమ్ లో కొత్తది.

Advertisement

ఆ తర్వాత ఈ పాయింట్ తో తెలుగు, తమిళంలో చాలా సినిమాలు వచ్చాయి. భోళా శంకర్ టైముకు ఈ కాన్సెప్ట్ అవుట్ డేటెడ్ అయిన ఫీలింగ్ కలిగింది. రొటీన్ పాయింట్ ను కొత్తగా చెప్పేలా సీన్స్ రాసుకున్న బాగుండేది. ఆ విషయంలో మెహర్ రమేష్ విఫలమైపోయాడు. కామెడీ మొత్తం మిస్ ఫైర్ అయ్యింది. కనీసం సింగిల్ సీన్ కూడా నవ్వించలేకపోయింది. ఫస్ట్ హాఫ్ లో వెన్నెల కిషోర్ ట్రాక్, సెకండ్ ఆఫ్ లో చిరంజీవి, శ్రీముఖి కామెడీ సీన్స్ జబర్దస్త్ స్కిట్లను తలపిస్తాయి. మెగాస్టార్ ని ఎలివేట్ చేసే ఒక్క సిట్యుయేషన్ గాని, హీరోయిజాన్ని నిలబెట్టే ఒక్క ఎమోషనల్ సీన్ గాని లేకుండా ఫ్లాట్ గా రన్ చేసేసారు. ఏ సన్నివేశం కూడా అజిత్ తో తమిళంలో లాగా మనసుపెట్టి తీయలేదు. ఇంటర్వెల్ తర్వాత ఒక పది నిమిషాలు మాత్రమే బలం. మిగతా ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ చిత్రీకరణ డొల్లగా ఉంది. సెకండ్ ఆఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ బాగుందనుకునేంతలోనే బోర్ గా మారిపోతుంది.

ప్లస్ పాయింట్లు :
చిరంజీవి
కామెడీ సన్నివేశాలు
పతాక సన్నివేశాలు
పాటలు

మైనస్ పాయింట్లు :
కథ
దర్శకత్వం

సినిమా రేటింగ్ : 2/5

ఇవి కూడా చదవండి : 

సినిమా నాశనం చేశారు.. చిరంజీవిపై శ్రీరెడ్డి సీరియస్‌ !

Bholaa Shankar : శ్రీముఖితో చిరంజీవి ఘాటు రొ***న్స్‌..ముసలోడంటూ కామెంట్స్‌ !

ICC World Cup 2023 : వరల్డ్‌ కప్‌ జట్టులోకి మన తెలుగోడు..మరో యువరాజ్‌ లా ఎంట్రీ !

Visitors Are Also Reading