Home » మయోసైటిస్ వ్యాధి కారణంగా సమంతకు 12 కోట్ల నష్టం !

మయోసైటిస్ వ్యాధి కారణంగా సమంతకు 12 కోట్ల నష్టం !

by Bunty
Ad

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఎంతమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ… హీరోయిన్ సమంతకు ఓ క్రేజ్ ఉంటుంది. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సమంత…. ఇప్పటికీ తన క్రేజ్ పెంచుకుంటూ వస్తోంది. అక్కినేని నాగచైతన్య తో ఏం మాయ చేసావే సినిమా సమయంలోనే ప్రేమలో పడింది సమంత. ఆ తర్వాత వీరు 2017 సంవత్సరంలో వివాహం కూడా చేసుకున్నారు.

Advertisement

అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల 2021 డిసెంబర్ మాసంలో ఈ జంట విడిపోయింది. ఇక విడాకుల తర్వాత ఎవరి దారి వారిదే అన్నట్లుగా… ముందుకు సాగుతోంది ఈ జంట. ఈ తరుణంలోనే సమంతకు ఇటీవల మయోసైటిస్ అనే భయంకరమైన వ్యాధి సోకింది. ఈ వ్యాధి కారణంగా ప్రస్తుతం ఆమె ఎలాంటి సినిమాలు సరిగా చేయడం లేదు. ఇప్పటికే ఒప్పుకున్న సినిమా ఖుషి ను పూర్తి చేసింది సమంత. అటు సిటాడెల్ కూడా తుది దశకు వచ్చిందట. ఈ తరుణంలో సమంత.. తన వ్యాధి నయం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందట. ఇందులో భాగంగానే… ఏడాది కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకుందట.

Advertisement

అప్పటివరకు ఎలాంటి సినిమాలు చేయకూడదని నిర్ణయించుకుందట. ఇక ఇప్పటివరకు ఒప్పుకున్న సినిమాల రెమ్యూనరేషన్ కూడా తిరిగి ఇచ్చేయాలని డిసైడ్ అయిపోయిందట. దీంతో సమంతకు ఏకంగా 12 కోట్ల నుంచి 15 కోట్ల వరకు నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సమంత ఒక్కో సినిమాకు మూడు నుంచి నాలుగు కోట్లు వసూలు చేస్తోంది. ఈ లెక్కన దాదాపు మూడు నుంచి నాలుగు సినిమాలను సమంత వదిలేసుకుందట. దీంతో ఆమెకు తీవ్ర నష్టం వాటిల్లిందని టాలీవుడ్ సర్కిల్స్ లో వార్త చెక్కర్లు కొడుతోంది.

ఇవి కూడా చదవండి

హీరోయిన్ వాణి విశ్వనాథ్ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?

వర్షాకాలంలో నాన్ వెజ్ ఎందుకు తినొద్దు… తినడం వల్ల కలిగే సమస్యలు ఏంటో తెలుసా..?

SRH కోసం సంచలన నిర్ణయం తీసుకున్న కావ్యా పాప !

Visitors Are Also Reading