Home » అబ్బాయి డైరెక్టర్ తో బాబాయ్ సినిమా..?

అబ్బాయి డైరెక్టర్ తో బాబాయ్ సినిమా..?

by Azhar
Ad

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. గత ఏడాది బాలయ్య హీరోగా వచ్చిన అఖండ సినిమా సూపర్ హిట్ కావడంతో.. అదే ఊపులో వెళ్ళిపోతున్నాడు. ప్రస్తుతం క్రాక్ సినిమా డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో సినిమా అనేది చేస్తున్నాడు బాలయ్య. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడితో కూడా సినిమా అనేది చేయనున్నాడు. దీనిపై ఇప్పటికే అధికారిక ప్రకటన అనేది వచ్చేసింది.

Advertisement

ఇక ఈ ఇద్దరి తర్వాత బాలయ్య చేయబోయే మరో సినిమా కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది. ఇక ఆ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరో కాదు.. ఎన్టీఆర్ తో జై లవకుశ వంటి సూపర్ హిట్ సినిమా తీసిన బాబీ. అప్పుడు అబ్బాయితో హిట్ కొట్టిన బాబీ ఇప్పుడు బాబాయ్ బాలయ్యతో కూడా హిట్ కొట్టాలని చూస్తున్నట్లు తెలుస్తుంది. అయితే బాబీ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో సినిమా అనేది చేస్తున్నాడు.

Advertisement

వాల్తేరు వీరయ్య పేరుతో వస్తున్న ఈ సినిమాలో రవితేజ కూడా నటించబోతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేయడానికి సిద్ధం అయిన బాబీ.. ఇప్పటికే ఆయనకు కథ కూడా చెప్పినట్లు తెలుస్తుంది. ఇక ఆ కథ బాగా నచ్చడంతో దానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు అని తెలుస్తుంది. అదే విధంగా బాబీ – బాలయ్య కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మించనుంది అని సమాచారం.

ఇవి కూడా చదవండి :

ఒక్కే మ్యాచ్ లో గొప్ప, చెత్త రికార్డులు సృష్టించిన రాహుల్..!

తిరువనంతపురంలో బౌలింగ్ పించ్ వెనుక కారణాలు తెలుసా..?

Visitors Are Also Reading