Home » అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రని రిజెక్ట్ చేసిన ఇద్దరు స్టార్ హీరోస్ ఎవరంటే ?

అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్రని రిజెక్ట్ చేసిన ఇద్దరు స్టార్ హీరోస్ ఎవరంటే ?

by Azhar
Published: Last Updated on
Ad

సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో చేసి సూపర్ హిట్ కొట్టడం అనేది చాలా మామూలు విషయం. అయితే కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా వచ్చిన సినిమా అన్నమయ్య.

Advertisement

అయితే ఈ సినిమా అనౌన్స్ చేసిన వెంటనే ఎంతో మంది ఆశ్చర్యపోయారు అనడంలో సందేహం లేదు. ఎందుకంటే నాగార్జున ఓ రొమాంటిక్ హీరోగా అభిమానుల మనసులో ముద్ర వేసుకున్నాడు అలాగే దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ప్రేమ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు.

అలాంటి వీరిద్దరి కాంబినేషన్లో ఓ భక్తి సినిమా రావడం అనేది అభిమానులను చాలా ఆశ్చర్యానికి గురి చేసింది. దాంతో ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతుంది అని అందరూ ఊహించారు. కానీ ఎవరూ ఊహించని విధంగా ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో నాగార్జున అన్నమయ్య పాత్రలో కనిపించగా వెంకటేశ్వరస్వామి గా సుమన్ కనిపించాడు.

Advertisement

అయితే సుమన్ చేసిన ఈ వెంకటేశ్వరస్వామి పాత్ర మొదట తనకు రాలేదట. ఎందుకంటే… ఈ సినిమాలో నాగార్జున చాలాసార్లు ఆ వేంకటేశ్వరుని పాదాల పైన పడాల్సి ఉంటుంది అందుకే ముందు ఇద్దరు పెద్ద హీరోల వద్దకు ఈ పాత్ర వెళ్లిందని తెలుస్తోంది. మొదట ఈ పాత్ర కోసం దర్శకుడు కె.రాఘవేంద్రరావు శోభన్ బాబు ని సంప్రదించారట. కానీ అప్పటికే సినిమాలకు దూరమైన శోభన్ బాబు చేయలేను అని చెప్పలేక ఎక్కువ రెమ్యూనరేషన్ అడగటంతో ఆయన్ని కాదని బాలకృష్ణ వద్దకి ఈ పాత్ర వచ్చిందట. కానీ ఇద్దరు పెద్ద హీరోలు ఒకే సినిమాలో ఇలా కనిపిస్తే అభిమానులు రిసీవ్ చేసుకుంటారో లేదో అని బాలకృష్ణ కూడా నో చెప్పాడట. ఆ తర్వాతే ఈ పాత్ర సుమన్ వద్దకు వెళ్ళింది అని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి :

ధోనిపైన నమ్మకం ఉంది.. కానీ..?

నా ప్రదర్శన భారత జట్టులో స్థానం కోసం కాదు..!

Visitors Are Also Reading