Home » ధోనిపైన నమ్మకం ఉంది.. కానీ..?

ధోనిపైన నమ్మకం ఉంది.. కానీ..?

by Azhar
Ad
నిన్న ముంబై ఇండియన్స్ – చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుంటే.. దానిని చూస్తున్న అభిమానుల పరిస్థితి ఏంటో కానీ… ఆడుతున్నా ఆటగాళ్ల పరిస్థితి మాత్రం మరో రేంజ్ లో ఉంది. ఆఖరి ఓవర్లో చెన్నై గెలవడానికి 17 పరుగులు కావాల్సిన సమయంలో.. అక్కడ గ్రౌండ్ లో ఉన్న ముంబై జట్టు ఆటగాళ్లు మాత్రమే కాదు… బయట ఉన్న చెన్నై ఆటగాళ్లు కూడా ఎంతో ఉత్కంఠంగా ఉన్నారు.
ఎందుకంటే.. ఇది ఆ రెండు జట్లకు చాలా కీలకమైన మ్యాచ్. అయితే ఇందులో గెలిచిన తర్వాత చెన్నై కెప్టెన్ రవీంద్ర జడేజా.. ఆఖరి ఓవర్ సమయంలో తమ ఫైలింగ్ ఏంటి అనేది వివరించాడు. నేను మా ఆటగాళ్లు అందరం డ్రెస్సింగ్ రూమ్ లో ఊపిరి బిగబట్టుకొని కూర్చున్నాము. కానీ అక్కడ గ్రౌండ్ లో ధోని ఉన్నాడు. అతను ఓ బ్రేస్య్త ఫినిషర్.
కాబట్టి అతను తన అనుభవం మొత్తని ఉపయోగిస్తాడు అని మాకు తెలుసు. అందుకే అక్కడ ధోని ఉన్నాడు… మన ప్రశాంతంగా ఉండవచ్చి అని మాకు మేము నచ్చజెపుకున్నం. మేము అనుకున్నట్లే ధోని మ్యాచ్ ను మా వైపు తిప్పి విజయాన్ని అందించాడు అని జడేజా చెప్పాడు. ఇక ఈ మ్యాచ్ తర్వాత జడేజా ధోనికి వంగి సలాం చేస్తున్న ఫోటో ఒక్కటి వైరల్ గా మారింది.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading