Home » రెండోసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందిన ‘బలగం’ వేణు.. ఆడబిడ్డతో ఆశీర్వాదం పొందామంటూ..!

రెండోసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందిన ‘బలగం’ వేణు.. ఆడబిడ్డతో ఆశీర్వాదం పొందామంటూ..!

by Anji
Ad

బలగం సినిమాతో దర్శకుడిగా బ్లాక్‌ బస్టర్‌ ఎంట్రీ ఇచ్చాడు జబర్దస్త్ కమెడియన్ వేణు యెల్దండి. తెలంగాణ సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లను ప్రతిబింబిస్తూ రూపొందిన మూవీ పలువురి ప్రశంసలను పొందింది. ఈ చిత్రానికి  అంతర్జాతీయంగా ఎన్నో అవార్డులు లభించాయి.  బలగం మూవీతో 2023ను మరుపురాని సంవత్సరంగా మార్చుకున్న బలగం వేణు ఇంట్లో మరోసారి ఆనందాలు వెల్లి విరిశాయి. అతని ఇంట్లోకి మహాలక్ష్మి అడుగుపెట్టింది. అదేనండి.. వేణు రెండోసారి తండ్రిగా ప్రమోషన్‌ పొందాడు.

Advertisement

అతని భార్య తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తాను రెండోసారి తండ్రైన విషయాన్ని వేణునే సోషల్‌ మీడియా ద్వారా అందరితో షేర్‌ చేసుకున్నాడు. ‘మాకు అమ్మాయి పుట్టింది. ఈ శుభవార్తను మీ అందరితో పంచుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది’ అని సోషల్‌ మీడియాలో వెల్లడించాడు. ఇందులో కూతురు ఫొటోను కూడా షేర్‌ చేశాడు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు వేణు దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా వేణు సతీమణి పేరు శ్రీలత. వీరిద్దరికి ఇదివరకే ఓ కొడుకు ఉన్నాడు.

Advertisement

ఇక కమెడియన్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన వేణు సుమారు 200కు పైగా సినిమాల్లో నటించాడు. స్టార్‌ హీరోల సినిమాల్లో కూడా స్పెషల్‌ రోల్స్‌ చేసి మెప్పించాడు. ఆ తర్వాత జబర్దస్త్‌ షోలోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి టీమ్‌ లీడర్‌ వరకు ఎదిగాడు. తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన వేణు మధ్యలో చాలా కాలం పాటు గ్యాప్‌ తీసుకున్నాడు. అయితే మెగా ఫోన్‌ పట్టుకుని బలగం సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది మార్చి 3న థియేటర్లలో విడుదలైన బలగం కలెక్షన్లతో పాటు ప్రశంసలు అందుకుంది. అంతర్జాతీయంగా ఏకంగా వందకు పైగా అవార్డులు సొంతం చేసుకుంది. ప్రస్తుతం తన రెండో సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు వేణు.  ఈ చిత్రం కూడా  దిల్‌ రాజు బ్యానర్‌లోనే తెరకెక్కనుందని సమాచారం. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

టైగర్ నాగేశ్వరావు మూవీ కోసం రవితేజ రెమ్యునరేషన్ ఎంత తీసుకున్నాడో తెలుసా ?

పవన్‌ లేకుండా.. రేణు దేశాయ్ ఇంత లగ్జరీ లైఫ్ గడపటానికి అలాంటి బిజినెస్ చేశారా ?

Visitors Are Also Reading