Home » ప్రతిష్టాపనకు ముందే రివీల్ అయినా రాముల వారి విగ్రహం.. షేర్ చేసిన యూనియన్ మినిస్టర్!

ప్రతిష్టాపనకు ముందే రివీల్ అయినా రాముల వారి విగ్రహం.. షేర్ చేసిన యూనియన్ మినిస్టర్!

by Srilakshmi Bharathi
Ad

సోమవారం జరిగే ‘ప్రాణ ప్రతిష్ఠ’ లేదా పవిత్రోత్సవానికి ముందు అయోధ్యలోని రామ మందిరంలో కొత్త శ్రీరాముని విగ్రహాన్ని నిన్న తీసుకొచ్చి పెట్టారు. విగ్రహం యొక్క మొదటి ఫోటోను ఈ ఉదయం కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాల రాముడిగా.. రాముల వారిని ఐదేళ్ల పిల్లవాడిగా రూపొందించారు. చూడముచ్చటగా ఉన్న బాల రాముడి విగ్రహం మొదటి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

మైసూరుకు చెందిన కళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కిన ఈ 51 అంగుళాల విగ్రహం నల్లరాతితో చేయబడింది. ప్రార్థనల మంత్రోచ్ఛరణల మధ్య గర్భగుడిలో బాల రాముడి విగ్రహాన్ని ఉంచారు. జనవరి 12 నుండి ఆలయ సంప్రోక్షణకు సంబంధించిన ఆచారాలు ప్రారంభమయ్యాయి. జనవరి 22న “ప్రాణ్ ప్రతిష్ట” కోసం ప్రధాని మోదీ పూజలు చేస్తారని వర్గాలు తెలిపాయి. లక్ష్మీకాంత్ దీక్షిత్ నేతృత్వంలోని అర్చకుల బృందం ప్రాణ్ ప్రతిష్ట యొక్క ప్రధాన కర్మలను నిర్వహిస్తుంది.

Advertisement

అయోధ్య రామ మందిర శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనడానికి ముందు ప్రధాని కొన్ని నియమాలు మరియు ఆచారాలను ఖచ్చితంగా పాటిస్తున్నారు. ప్రధాని కేవలం దుప్పటితో నేలపై నిద్రిస్తున్నారని, కేవలం కొబ్బరి నీళ్లు మాత్రమే తాగుతున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. జనవరి 22న అయోధ్యను సందర్శించవద్దని ఆయన ప్రజలను కోరారు, ఎందుకంటే “రాముడికి ఎటువంటి సమస్యలు కలిగించడానికి మేము ఇష్టపడము” అని, జనవరి 23 నుండి ప్రతి ఒక్కరూ రావచ్చు అని ఆయన స్పష్టం చేసారు. జనవరి 22న ప్రతి భారతీయుడు తమ ఇంట్లో దీపం వెలిగించాలని కూడా ఆయన కోరారు. ఆలయ ట్రస్ట్ ద్వారా ప్రత్యేకంగా ఆహ్వానించబడిన దేశ, విదేశాల నుండి 11,000 మందికి పైగా అతిథులు ఈ సంప్రోక్షణకు సాక్ష్యమివ్వనున్నారు.

తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading