Home » BCCI పరువు తీసిన బెయిర్‌స్టో …38 గంటలా అంటూ !

BCCI పరువు తీసిన బెయిర్‌స్టో …38 గంటలా అంటూ !

by Bunty
Ad

ఇంగ్లాండ్ స్టార్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో బీసీసీఐ ఆతిథ్యంపై మండిపడ్డాడు. వన్డే ప్రపంచ కప్ కోసం భారత్ కు వచ్చిన అతడు సౌకర్యవంతమైన సదుపాయాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సహజంగా జట్టులోని ప్రధాన ఆటగాళ్లకు బిజినెస్ క్లాస్ టికెట్స్ ను బుక్ చేస్తారు. మిగతా ఆటగాళ్లకు ఎకానమీ క్లాస్ టికెట్లను బుక్ చేస్తారు. అయితే తనకోసం బిజినెస్ క్లాస్ టికెట్ కాకుండా ఎకానమీ క్లాస్ టికెట్లు బుక్ చేయడం ఏంటని బీసీసీఐపై అసహనం వ్యక్తం చేశాడు.

Advertisement

వరల్డ్ కప్ నేపథ్యంలో భారత్ తో ఈరోజు జరగనున్న వార్మ్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ టీం గౌహతి చేరుకుంది. ఇంగ్లాండ్ నుంచి గౌహతికి కనీసం 38 గంటల పాటు ప్రయాణం చేయవలసి ఉంటుంది. అయితే అంత సేపు సాధారణ ప్రయాణికులతో ప్రయాణం చేయడం అయోమయానికి గురి చేసిందంటూ వ్యాఖ్యానించాడు. బెయిర్ స్టోతో పాటు కెప్టెన్ జోస్ బట్లర్, క్రిస్ వోక్స్ కూడా ఉన్నారు. అయితే వీళ్లకు ఎకానమీ టికెట్లు బుక్ చేయడంతో తోటి ప్రయాణికులు సెల్ఫీలు అడిగి కాస్త ఇబ్బందిపెట్టారు.

Advertisement

పైగా 38 గంటల పాటు సాధారణ ప్రయాణికులతో జర్నీ చేయడం కాస్త ఇన్ సెక్యూర్ గా అనిపించినట్టు బెయిర్ స్టోక్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ ఏడాది ప్రపంచకప్ టైటిల్ ఫేవరెట్ జట్లలో ఇంగ్లాండ్ కూడా చోటు దక్కించుకుంది. మెగా టోర్నీలో ఆడబోయే ఆటగాళ్లలో జోస్ బట్లర్, మోయిన్ అలీ, హ్యారీ బృక్, జానీ బెయిర్ స్టో, సామ్ కరణ్, లియాంగ్ లివింగ్ స్టోన్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, బెన్ స్టోక్స్, డేవిడ్ విల్లే, డేవిడ్ మలన్, క్రిస్ వోక్స్ వంటి మరికొందరు డేంజరస్ ఆటగాళ్లు ఉన్నారు.

Visitors Are Also Reading